త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్ కోసం దిల్లీ క్యాపిటల్స్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. కొత్త కెప్టెన్ పంత్ నేతృత్వంలో అదరగొట్టేందుకు తీవ్రంగా ప్రాక్టీసు చేస్తోంది. మరోవైపు బయో బబుల్ కావడం వల్ల హోటల్ రూమ్‌ల్లోనే ఆటగాళ్లు సరదగా సరదాగా గడుపుతున్నారు.
కెప్టెన్ పంత్ కోసం కరన్ స్పెషల్ కాఫీ! - DELHI CAPITALS CAPTAIN PANT
ఐపీఎల్లో భాగంగా ప్రస్తుతం బయో బబుల్‌లో ఉన్న దిల్లీ ఆటగాళ్లు.. ఖాళీ సమయంలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో పంత్ ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నాడు.
![కెప్టెన్ పంత్ కోసం కరన్ స్పెషల్ కాఫీ! Tom curran Making Coffee For his Captain Rishabh Pant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11256566-146-11256566-1617376531530.jpg)
కెప్టెన్ పంత్ కోసం కరన్ స్పెషల్ కాఫీ!
ఈ క్రమంలోనే జట్టులోని ఆటగాడు టామ్ కరన్.. కెప్టెన్ పంత్ కోసం కాఫీ చేస్తూ కనిపించాడు. ఆ వీడియోను పంత్ స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడం విశేషం. తమ తొలి మ్యాచ్‌లో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది దిల్లీ. ఏప్రిల్ 9న ముంబయి వేదికగా ఈ పోరు జరగనుంది.