తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కైఫ్​, యువీ లాంటి భాగస్వామ్యం అవసరం' - నరేంద్ర మోదీ న్యూస్​

మార్చి 22న ప్రజలంతా కలిసి జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని టీమిండియా మాజీ క్రికెటర్​ మహ్మద్ ​కైఫ్ ట్విట్టర్​లో​ తెలిపాడు. ఈ పోస్ట్​పై ప్రధాని మోదీ స్పందించారు. కరోనా నియంత్రణకు ప్రజలంతా కలిసి భాగస్వామ్యంగా మారాలని ఆయన కోరారు.

To prevent Covid-19, we are all need to Form together: PM Modi
'కైఫ్​, యువీ లాంటి భాగస్వామ్యం అవసరం'

By

Published : Mar 21, 2020, 11:07 AM IST

గురువారం నరేంద్రమోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మార్చి 22న ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు. ఆ రోజంతా ఇంటికే పరిమితమవ్వాలని సూచించారు. దీన్ని సమర్ధిస్తూ పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్​ కైఫ్​ ఈ విషయాన్ని ట్విట్టర్​లో ప్రతిపాదించాడు. దీనికి ప్రధాని మోదీ స్పందించారు. మహ్మద్​కైఫ్, యువరాజ్​ పార్ట్​నర్​షిప్​ లాగా ప్రజలంతా కరోనాపై పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

2002లో జరిగిన నాట్​వెస్ట్​ సిరీస్​ ఫైనల్​లో మహ్మద్ ​కైఫ్​, యువరాజ్​ సింగ్ కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయం సాధించంటంలో కీలక పాత్ర పోషించారు. ఆ మ్యాచ్​లో ఇంగ్లాండ్​ జట్టు 326 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో టీమిండియా 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బరిలో దిగిన యువరాజ్​, కైఫ్ 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 69 పరుగులు చేసి యువరాజ్​ వెనుదిరగగా.. కైఫ్​ చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ తుదిపోరులో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది టీమిండియా.

ఇదీ చూడండి.. షట్లర్​కు కరోనా.. అవాక్కైన సైనా

ABOUT THE AUTHOR

...view details