తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బ్రో సమాచారం ఇస్తావా'.. షకిబ్-బుకీ సంభాషణ బహిర్గతం - shakib suspected bookie

బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబ్​ అల్​ హసన్​, భారత బుకీ దీపక్ అగర్వాల్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను ఐసీసీ విడుదల చేసింది. అందులో దీపక్... షకిబ్​ నుంచి జట్టు వ్యూహాలు, అంతర్గత సమాచారం కోసం అడగడానికి ప్రయత్నించినట్లు స్పష్టంగా వెల్లడైంది.

'బ్రో సమాచారం ఇస్తావా'.. షకిబ్ వాట్సాప్ సంభాషణ

By

Published : Oct 30, 2019, 1:11 PM IST

ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకిబ్​ అల్​ హసన్ వాట్సాప్​ సంభాషణను బహిర్గతం చేసింది ఐసీసీ. భారత బుకీ దీపక్ అగర్వాల్​తో కొనసాగించిన సందేశాలను విడుదల చేసింది.

ఇద్దరం కలిసి పనిచేద్దాం..

2018 జనవరి 19న దీపక్ అగర్వాల్​ నుంచి షకిబ్​ అల్​ హసన్​కు వాట్సాప్​ సందేశం వచ్చింది. మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​గా ఎంపికైనందుకు షకిబ్​​ను అభినందించాడు దీపక్​. తర్వాతి మెసేజ్​లో 'మనం ఈ విషయంపై కలిసి పనిచేద్దాం లేదా ఐపీఎల్​ వరకు నేను ఎదురుచూస్తా' అని సంభాషించాడు.

జట్టు గురించి సమాచారం అడిగేందుకు దీపక్ ప్రయత్నించాడు. ఆ విషయాన్ని షకిబ్​ ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి(ఏసీయూ), ఇతర అవినీతి నిరోధక సంస్థలకుగానీ చేరవేయలేదు.

'బ్రో ఈ సిరీస్​లో ఏమైనా ఉందా..'

జనవరి 23న అతడి నుంచి షకిబ్​కు మరో సందేశం వచ్చింది. ఈ సిరీస్​లో ఏమైనా సమాచారం దొరుకుతుందా(బ్రో ఎనీథింగ్ ఇన్ దిస్ సిరీస్​) అని అడిగాడు. ఈ మెసేజ్​తో జట్టు అంతర్గత సమాచారం తీసుకునేందుకు దీపక్ ప్రయత్నించాడనే విషయం స్పష్టంగా తేలిపోయింది. ఈ అంశాన్నీ అధికారుల దృష్టికి తీసుకురాలేదు షకిబ్.

షకిబుల్ హసన్

కలుద్దామనుకుంటున్నా..

ఏప్రిల్ 26న షకిబ్​ను మరోసారి సంప్రందించాడు దీపక్ అగర్వాల్. ఈ సారి సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టులో ఏ ఆటగాడు ఆడతాడు, వారి వివరాలను అడిగాడు. అంతేకాకుండా షకిబ్​కు సంబంధించిన డాలర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు, బిట్ కాయిన్స్ సంబంధిత ఖాతాల గురించి సంభాషించాడు. ఈ కబుర్లు కొనసాగుతుండగానే దీపక్​ తనను కలవాలనుకుంటున్నాడని షకిబ్​ తెలిపాడు.

ఇదే రోజు బంగ్లా క్రికెటర్​ కొన్ని మెసేజ్​లు డిలీట్ చేశాడు. వాటి గురించి ఆరా తీయగా.. జట్టు అంతర్గత సమాచారం గురించి అడిగాడని తెలిపాడు షకిబ్​. అయితే దీపక్ బుకీ అని తెలిసిందని​, అతడితో ప్రమాదముందని గ్రహించానని చెప్పాడు.

ఈ విషయం ఐసీసీకి వెల్లడించడంలో విఫలమైనందుకు షకిబ్​​పై రెండేళ్ల పాటు వేటు వేసింది ఐసీసీ. తప్పును అంగీకరించినందుకు గాను ఏడాది నిషేధం, ఏడాది సస్పెన్షన్​లో ఉంచింది. దీపక్‌ అడిగిన సమాచారం.. షకిబ్‌ అందించినట్లు ఆధారాలేమీ లేవు కానీ.. తనను బుకీ సంప్రదించిన విషయంపై అతడు ఏసీయూకు సమాచారం ఇవ్వకపోవడం ఐసీసీ ఆగ్రహానికి కారణమైంది.

వచ్చే ఏడాది అక్టోబరు 29 వరకు షకిబ్​ అంతర్జాతీయ క్రికెట్​కు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న 2020 ప్రపంచకప్​నకూ దూరమయ్యాడు.

ఇదీ చదవండి: పొట్టి ప్రపంచకప్​లో ఆడనున్న నమీబియా

ABOUT THE AUTHOR

...view details