ప్రపంచకప్ తర్వాత కోహ్లీ సారథ్య బాధ్యతలు, ధోనీ రిటైర్మెంట్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఈ వరల్డ్‌కప్ తర్వాత మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. టీమిండియా ట్రోఫీ గెలిస్తే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. సెమీ ఫైనల్లో ఓడిన తర్వాత అంతా మారిపోయింది. ఇప్పుడు ధోనీతో పాటు కోహ్లీ సారథ్య బాధ్యతలపై భిన్న వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా ధోనీ రిటైర్మెంట్పై భారత మాజీ ఆటగాడు గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టుకోసం ధోనీ ఎంతో చేసినప్పటికీ యువ క్రికెటర్లను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని తెలిపాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచించేవాడని అన్నాడు.
"నాకు ఇప్పటికీ గుర్తు...ఆస్ట్రేలియాతో సీబీ సిరీస్‌లో సచిన్, సెహ్వాగ్‌లు ఆడలేరని.. అక్కడి గ్రౌండ్‌లు పెద్దగా ఉంటాయని ధోనీ అన్నాడు. వచ్చే ప్రపంచకప్‌లో యువ ఆటగాళ్లు కావాలని మహీ ఆలోచించే ఉంటాడు. రిషభ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఇలా ఏ యువ వికెట్ కీపర్ అయినా ఎదగాల్సిన అవసరం ఉంది"
-గంభీర్, టీమిండియా మాజీ ఆటగాడు.