తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్వదేశంలో వెటోరి రికార్డు బ్రేక్​ చేసిన సౌథీ

న్యూజిలాండ్​ సీనియర్​ పేసర్​ టిమ్​ సౌథీ అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత్​తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 4 వికెట్లు తీసిన ఈ స్టార్​ బౌలర్​.. రెండో ఇన్నింగ్స్​లో మయాంక్​ అగర్వాల్​ను ఔట్​ చేయడం ద్వారా ఓ ఘనతను సాధించాడు.

Tim Southee first bowler to take 300 international wickets
భారత్​ X కివీస్​​: స్వదేశంలో వెటోరి రికార్డు బ్రేక్​ చేసిన సౌథీ

By

Published : Feb 23, 2020, 1:18 PM IST

Updated : Mar 2, 2020, 7:12 AM IST

న్యూజిలాండ్​ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డు సృష్టించాడు టిమ్​ సౌథీ. టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఈ ఫీట్​ అందుకున్నాడు.

భారత ఓపెనర్​ మయాంక్​ అగర్వాల్​(58)ను పెవిలియన్​ పంపిన సౌథీ.. సొంతగడ్డపై 300 వికెట్​ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 225 ఇన్నింగ్స్​ల్లో 299 వికెట్లతో కివీస్​ దిగ్గజ స్పిన్నర్​ డేనియల్​ వెటోరి ఉండేవాడు. ఇతడిని 186 ఇన్నింగ్స్​ల్లో అధిగమించాడు సౌథీ. వీరిద్దరి తర్వాత బౌల్ట్​(277) మూడో ర్యాంక్​లో ఉన్నాడు.

Last Updated : Mar 2, 2020, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details