తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా కెప్టెన్​కు అశ్విన్​ స్వీట్​ వార్నింగ్​! - సిడ్నీ టెస్టు

మూడో టెస్టు చివరి రోజున ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​ పైన్​, టీమ్ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. టిమ్​ పైన్​ చేసిన వ్యాఖ్యలకు అశ్విన్​ తనదైన రీతిలో ప్రత్యర్థికి స్వీట్​ వార్నింగ్​ ఇచ్చాడు.

Tim Paine tries to sledge, R Ashwin gives it back to him
ఆస్ట్రేలియా కెప్టెన్​కు అశ్విన్​ స్వీట్​ వార్నింగ్​!

By

Published : Jan 11, 2021, 3:57 PM IST

సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు చివరి రోజున ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​ పైన్​, టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ల​ మధ్య మాటల యుద్ధం జరిగింది. అశ్విన్​ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతడ్ని ఏకాగ్రత దెబ్బ తీసేందుకు పైన్​ వ్యాఖ్యలు చేశాడు. దానికి బదులుగా తనదైన రీతిలో పైన్​కు స్వీట్​వార్నింగ్​ ఇచ్చాడు అశ్విన్. వారిద్దరి సంభాషణ స్టంప్స్​ మైక్​లో రికార్డు అయ్యింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

టిమ్​పైన్​:నిన్ను గబ్బా(బ్రిస్బేన్​ టెస్టు)లో ఎదుర్కొవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా.. అశ్విన్​!

అశ్విన్​:మేము కూడా మిమ్మల్ని భారత్​లో కలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాం. బహుశా నీకు అదే చివరి సిరీస్​ కావొచ్చు.

ఆస్ట్రేలియాతో తలపడిన మూడో టెస్టును భారత్‌ డ్రాగా ముగించింది. 407 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగింది టీమ్ఇండియా. 98/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌లో మరో 3 వికెట్లు కోల్పోయి 131 ఓవర్లలో 334/5 స్కోరు సాధించింది. దీంతో ఫలితం తేలుతుందని భావించిన సిడ్నీ టెస్టు‌ డ్రాగా ముగిసింది.

జాతివివక్ష వ్యాఖ్యలు

సిడ్నీ టెస్టులో ఆసీస్​ ఆటగాళ్ల కవ్వింపులతో పాటు టీమ్ఇండియా క్రికెటర్లపై ప్రేక్షకులు జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. బుమ్రా, సిరాజ్​లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం వల్ల ఆరుగురు వీక్షకులను స్టేడియం నుంచి బహిష్కరించారు.

ఇదీ చూడండి:టీమ్ఇండియా జెంటిల్​మెన్ గేమ్.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు

ABOUT THE AUTHOR

...view details