డిసెంబరు 17నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ పుజారాను ఎదుర్కోవడం సవాల్ లాంటిదని అభిప్రాయపడ్డాడు ఆసీస్ సారథి టిమ్‌పైన్. అతడి వల్ల తమ బౌలర్లు ఎక్కువ ఇబ్బంది పడతారని అన్నాడు. అతడి వికెట్ తీయడంపై తమ జ్టటు ఎక్కువ దృష్టి సారిస్తుందని చెప్పాడు. గత సిరీస్‌లో భారత విజయంలో పుజారా కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు పైన్. వికెట్ కీపర్ పంత్‌పై ప్రశంసలు జల్లు కురిపించాడు పైన్. అతడికి దగ్గర పవర్ హిట్టింగ్ సామర్థ్యం మెండుగా ఉందని అన్నాడు. అయితే, తొలి టెస్టు తుది జట్టులో పంత్‌కు అవకాశం దక్కలేదు.
అతడిని ఎదుర్కోవడం మా బౌలర్లకు సవాల్: పైన్ - cheteswar pujara tim paine
టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్ పుజారాను ఎదుర్కోవడం తమ బౌలర్లకు కష్టమవుతుందని అన్నాడు ఆసీస్ సారథి టిమ్‌పైన్. కాగా, పంత్ దగ్గర పవర్ హిట్టింగ్ సామర్థ్యం మెండుగా ఉందని కితాబిచ్చాడు.
పూజారా
డిసెంబరు 17వ తేదీ నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. డిసెంబర్ 17-21 వరకు అడిలైడ్‌లో తొలి మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత టెస్టులకు మెల్‌బోర్న్ (26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి. ఇప్పటికే జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో వన్డేను ఆసీస్, టీ20ను టీమ్ఇండియా కైవసం చేసుకున్నాయి.
ఇదీ చూడండి : ఒక్కో బ్యాట్స్‌మన్ కోసం ఒక్కో ప్లాన్: కోహ్లీ