ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు చేసిన పరీక్షల్లో దక్షిణాఫ్రికా క్రికెటర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడితో సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరు ఆటగాళ్లు నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా బోర్డు వెల్లడిచించింది. ఈ రెండు జట్ల మధ్య నవంబరు 27 నుంచి పరిమిత ఓవర్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందుకోసం కేప్‌టౌన్‌లో బయో-బబుల్‌ను సృష్టించారు.
ఒకరికి పాజిటివ్.. ఐసోలేషన్‌లో మరో ఇద్దరు క్రికెటర్లు - ఇంగ్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా వార్తలు
దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ఒకరికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అతడితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లను బోర్డు నిర్బంధంలో ఉంచింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు చేసిన టెస్ట్‌ల్లో ఈ విషయం బయటపడింది.
"ఓ క్రికెటర్‌కు కొవిడ్ సోకినట్లు తేలింది. అతడితో సన్నిహితంగా మరో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నట్లు గ్రహించాం. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఈ ముగ్గుర్ని కేప్‌టౌన్‌లో నిర్బంధించాం. మిగిలిన ఆటగాళ్లకు నెగిటివ్‌గా తేలడం వల్ల వైద్యబృందం వారిని పర్యవేక్షిస్తుంది. ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం కేప్‌టౌన్‌లో బయో-బబుల్‌ను ఏర్పాటు చేశాం. క్రికెటర్లు, సహాయక సిబ్బందితో కలిసి దాదాపు 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించాం" అని సఫారీ క్రికెట్ బోర్డు తెలిపింది.
కేప్‌టౌన్‌తో పాటు న్యూ వన్లాండ్స్లో టీ20 సిరీస్‌ను.. బోలాండ్ పార్క్ వేదికల్లో మూడు వన్డేలను నిర్వహించనున్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాళ్లందరికి కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్ధారణ అయింది.