శ్రీలంక ఆల్‌రౌండర్ తిసారా పెరీరా సరికొత్త రికార్డును నమోదు చేశాడు. దేశవాళీ క్రికెట్లో భాగంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఏ ఫార్మాట్లోనైనా ఈ ఫీట్ సాధించిన తొలి లంక క్రికెటర్‌గా నిలిచాడు.
పనగోడా వేదికగా జరిగిన ఆర్మీ శ్రీలంక-బ్లూమ్‌ఫీల్డ్ మ్యాచ్‌లో పెరీరా ఈ ఘనత సాధించాడు. కేవలం 13 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. మొత్తంగా 8 సిక్స్‌లు బాదిన కొట్టిన తిసారా.. వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో లంక ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2005లో లంక ప్లేయర్ వీరరత్నే 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు.