తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే.! - Crowd Vandemataram

గువాహటి వేదికగా శ్రీలంకతో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​కు వచ్చిన ప్రేక్షకులు అందరూ కలిసి వందేమాతరం గీతం ఆలపించారు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది బీసీసీఐ.

This Video From Guwahati Will Give You Goosebumps
వైరల్: ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కపొడుచుకోవాల్సిందే.!

By

Published : Jan 6, 2020, 10:29 AM IST

ఏఆర్ రెహమాన్ ఆలపించిన వందేమాతరం గీతం వింటుంటే ప్రతి భారతీయుడి తనువంతా దేశభక్తి భావంతో పులకించిపోతుంది. అదే వేల మంది ఒక్కసారిగా పాడుతుంటే ఎలా ఉంటుంది.. రోమాలు నొక్కబొడుచుకోవాల్సిందే. ఇదే సంఘటన అసోం గువాహటి బర్సాపారా స్టేడియంలో ఆవిష్కృతమైంది.

శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్​ కోసం బర్సాపారా జనంతో కిక్కిరిసిపోయింది. వర్షంతో మ్యాచ్ ఆలస్యమైన తరుణంలో ప్రేక్షకులంతా రెహమాన్ పాడిన వందేమాతరం గీతం ఆలపించడం మొదలుపెట్టారు. అది వింటున్నప్పుడు ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది బీసీసీఐ.

అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మ్యాచ్‌ 7 గంటలకు ప్రారంభంకావాల్సి ఉండగా 6:30 గంటలకు టాస్‌ వేశారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా.. మ్యాచ్‌కు కాసేపటి ముందే వర్షం ప్రారంభమైంది. అరగంటకు పైగా ఏకధాటిగా వర్షం కురవడం వల్ల పిచ్‌ చిత్తడిగా మారింది. మైదానం సిబ్బంది తేమ తొలగించేందుకు ఎన్ని ప్రయత్నాలూ చేసినా పరిస్థితిలో మార్పు కనపించలేదు. అనంతరం పిచ్​ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదీ చదవండి: నేను సెలక్టరైతే ధావన్​ను తీసుకోను: శ్రీకాంత్

ABOUT THE AUTHOR

...view details