కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలు నిలివేశారు. దాదాపుగా రెండు నెలల తర్వాత ఇప్పుడిప్పుడే టోర్నీల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. జర్మనీలో శనివారం నుంచి ఫుట్బాల్ మ్యాచ్లు ప్రారంభం అవ్వబోతున్నాయి. క్రికెటర్లను ఐసోలేషన్లో ఉంచి టోర్నీలు నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయిస్తోంది.
ఇలాంటి సమయంలో అంతర్జాతీయ మ్యాచ్ల కంటే దేశవాళీ టోర్నీలపై దృష్టి సారించాలని టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి సూచించాడు. క్రికెటర్లంతా మైదానంలోకి వచ్చి దేశవాళీ క్రికెట్కు పూర్వవైభవం తీసుకురావాలని కోరాడు.