తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసిన రోజు! - భారత్ టీ20 ప్రపంచకప్ 2007

తొలి టీ20 ప్రపంచకప్​ను భారత్​ గెలిచి, నేటికి(సెప్టెంబరు 24) సరిగ్గా 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ మ్యాచ్​ విశేషాలు మీకోసం.

This day, that year: When MS Dhoni-led India won inaugural T20 WC
భారత్ టీ20 ప్రపంచకప్ 2007

By

Published : Sep 24, 2020, 3:34 PM IST

Updated : Sep 24, 2020, 3:42 PM IST

భారత్​పై గెలవాలంటే పాకిస్థాన్ జట్టుకు 13 పరుగులు కావాలి. ఉన్నది ఒకటే ఓవర్, ఒకటే వికెట్. క్రీజులో కెప్టెన్ మిస్బా ఉల్ హక్. అనామక బౌలర్ జోగిందర్ శర్మకు కెప్టెన్ ధోనీ బంతి అందించాడు. రెండో బంతికే మిస్బా సిక్స్​ కొట్టడం వల్ల టీమ్​ఇండియా శిబిరంలో ఆందోళన. మరుసటి బంతిని షార్ట్​ లెగ్ దిశగా స్కూప్​ చేశాడు మిస్బా. శ్రీశాంత్ క్యాచ్ అందుకున్నాడు. స్టేడియంలో అభిమానులు కేరింతలు. భారత ఆటగాళ్ల ముఖంలో ఆనందం. అప్పుడే ధోనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసింది. భారత్ తొలి టీ20 ప్రపంచకప్​ను ముద్దాడింది. సరిగ్గా ఇది జరిగి నేటికి(సెప్టెంబరు 24) 13 ఏళ్లు.

దక్షిణాఫ్రికాలో 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్​ను నిర్వహించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. అదే ఏడాది వన్డే ప్రపంచకప్​లో ఘోర పరాభవం ఎదుర్కొవడం వల్ల సచిన్, ద్రవిడ్, గంగూలీ లాంటి దిగ్గజాలు లేకుండానే, టోర్నీలో బరిలోకి దిగింది ధోనీ సారథ్యంలో టీమ్​ఇండియా.

ఫైనల్​కు చేరే క్రమంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి పటిష్ఠ జట్లను ఓడించి భారత కుర్రాళ్లు ఔరా అనిపించారు. తుదిపోరులో పాకిస్థాన్​పై చిరస్మరణీయ విజయం సాధించి చరిత్రలో నిలిచిపోయారు.

ఫైనల్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఛేదనలో పాక్.. వికెట్లన్నీ కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇది చదవండి:'పాక్​తో మ్యాచ్​లో కనురెప్ప వేయకుండా ధోనీ సరేనన్నాడు'

Last Updated : Sep 24, 2020, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details