తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీని  ట్రోల్​​ చేసిన కూతురు సనా

టీమిండియా టెస్టు సిరీస్​ గెల్చిన తర్వాత కోహ్లీకి ట్రోఫీ అందిస్తూ ఓ ఫొటో దిగాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. దాన్ని ఇన్​స్టాలో పోస్టు చేయగా.. ఆ లుక్​ను సరదాగా ట్రోల్​ చేసింది దాదా కుమార్తె సనా. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందర్నీ ఆకట్టుకుంటోంది.

ganguli latest news
దాదాను ఆట పట్టించిన కుమార్తె

By

Published : Nov 26, 2019, 12:25 PM IST

Updated : Nov 26, 2019, 2:13 PM IST

ఈడెన్​ వేదికగా బంగ్లాదేశ్​తో జరిగిన చారిత్రక డే/నైట్‌ టెస్టులో... టీమిండియా ఇన్నింగ్స్​ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్​ అనంతరం భారత జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి ట్రోఫీ అందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. ఆ సమయంలో తీసకున్న ఓ చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నాడు దాదా. అభిమానులను ఆకట్టుకున్న ఆ ఫొటోలో దాదా కాస్త సీరియస్‌ లుక్‌లో కనిపించాడు.

గంగూలీ పోస్టు చేసిన ఫొటో

ఈ పోస్ట్​పై ఆయన కుమార్తె సనా మాత్రం సరదాగా స్పందించింది. "మీకు నచ్చనిది ఏంటి?" అని దాదా కోపంపై వ్యంగ్యంగా సెటైర్​ వేసింది. కూతురు పోస్టుకు స్పందించిన గంగూలీ... " నువ్వు మాట వినకుండా ఉండటమే" అని చమత్కరించాడు. వెంటనే ఆమె "మీ నుంచే నేర్చుకుంటున్నాను" అని రాసి స్మైలీ ఎమోజీ పెట్టింది. ఇన్‌స్టాలో తండ్రీకూతుళ్ల ఈ సరదా సంభాషణ అందర్నీ ఆకట్టుకుంటోంది.

దాదా-సనా సంభాషణ

భారత్‌- బంగ్లాదేశ్ డే/నైట్‌ టెస్టును బీసీసీఐ, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం(క్యాబ్​) విజయవంతంగా నిర్వహించాయి. పిచ్‌ను సిద్ధం చేయడం నుంచి ట్రోఫీ ప్రదానోత్సవం వరకు ఎన్నోపనులను చక్కగా పర్యవేక్షించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ. టెస్టు చూడటానికి వచ్చిన అతిథులను గౌరవించాడు. మ్యాచ్‌ వీక్షించేందుకు వేలాది మంది అభిమానులు పోటెత్తారు. ఈ పోరులో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇదీ చదవండి:ప్రతి టెస్టు మ్యాచ్​కు ఇంతే ఆదరణ లభిస్తే...!

Last Updated : Nov 26, 2019, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details