క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. తన పొలంలో సేంద్రీయ కూరగాయలను, పండ్లను పండిస్తూ బిజీగా గడుపుతున్నాడు. శుక్రవారం తాను పండిస్తున్న స్ట్రాబెర్రీ పంటను పరిశీలించాడు. అక్కడే ఉన్న ఒక స్ట్రాబెర్రీ పండును తింటున్న ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
"నేను ఇలానే తింటూ ఉంటే మార్కెట్‌కు పంపడానికి ఒక్క స్ట్రాబెర్రీ కూడా మిగలదు" అనే ట్యాగ్‌తో ధోనీ ఆ వీడియోను షేర్ చేశాడు.