స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను విండీస్ జట్టు కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో కరీబియన్ జట్టు అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. దినేష్ చండిమల్ (54), అషెన్ బండారా (44) రాణించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మాథ్యూస్ సేనను తక్కువ పరుగులకే పరిమితం చేసింది విండీస్.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పొలార్డ్ సేన.. 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. లక్ష్యాన్ని ఛేదించింది. సిమన్స్ (26), పూరన్ (23) మెరుగైన ప్రదర్శన చేశారు. లంక బౌలర్లలో లక్షణ్ సందాకన్ 3, డిసిల్వా 2 వికెట్లు తీసినప్పటికీ.. ఫలితం లేకపోయింది.