కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ షెడ్యూలు ప్రకారం అక్టోబరు-నవంబరులో జరిగే అవకాశాలు కనిపించట్లేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ అన్నాడు. ఆ సమయంలో ఐపీఎల్ జరిగితే ఆసీస్ బోర్డు తమ ఆటగాళ్లను ఆ టోర్నీలో ఆడేందుకు అనుమతించే అవకాశముందని చెప్పాడు.
'టీ20 ప్రపంచకప్ జరిగే అవకాశాలు లేవు' - IPL 2020 news
టీ20 ప్రపంచకప్ ప్రణాళిక ప్రకారం జరిగే అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్. దీనిపై ఈ నెల 28న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం ప్రకటిస్తే.. క్రికెటర్లంతా ముందస్తు ప్రణాళిలకలను సిద్ధం చేసుకుంటారని వెల్లడించాడు.
"ముందస్తు షెడ్యూలు ప్రకారం అక్టోబరు- నవంబరులో టీ20 ప్రపంచకప్ జరగకపోవచ్చని అనుకుంటున్నా. దీనిపై ఈ వారమే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు అందరూ ప్రణాళికలు రచించుకుంటారు" అని టేలర్ అన్నాడు. ఈ నెల 28న జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో టీ20 ప్రపంచకప్ నిర్వహణ సహా అనేక అంశాలపై చర్చించనున్నారు. అయితే టీ20 ప్రపంచకప్‌పై ఆగస్టు వరకు ఎలాంటి నిర్ణయం రాకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ చెప్పాడు. ఈ టోర్నీ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు ఆస్ట్రేలియాలో జరగాల్సివుంది.
ఇదీ చూడండి...'కచ్చితంగా ఆ అనుభూతిని మిస్ అవుతాం!'