తెలంగాణ

telangana

ETV Bharat / sports

భువీని 'శ్రీమంతుడ్ని' చేసిన సన్​రైజర్స్​- ఫన్నీ ట్వీట్​ - ఐపీఎల్

సరికొత్త రీతిలో ఐపీఎల్​ సందడి ప్రారంభించింది సన్ రైజర్స్​ హైదరాబాద్​ ఫ్రాంఛైజీ. తాజాగా తమ ఆటగాడు భువనేశ్వర్​కు సంబంధించిన ఓ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది. అది ప్రస్తుతం వైరల్​గా మారింది.

The Sunrisers Hyderabad franchise has started the latest IPL buzz.
భువీపై సన్​రైజర్స్​ ఫన్నీ ట్వీట్​.. పోస్ట్​ వైరల్

By

Published : Mar 30, 2021, 5:52 PM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​ సరికొత్త రీతిలో ఐపీఎల్​ సందడిని షురూ చేసింది. సామాజిక మాధ్యమాల్లో తమ ఆటగాళ్ల ఫొటోలను ఎడిట్​ చేస్తూ.. తెలుగు సినిమా టైటిళ్లతో, హిట్టు డైలాగ్​లను జోడిస్తుంది. ఇది వరకే మనీశ్​ పాండే ఫొటోను అరవింద సమేత వీర రాఘవ సినిమా తరహాలో పోస్టు చేసిన సన్​రైజర్స్.. తాజాగా మరో క్రికెటర్​ భువనేశ్వర్​ను ఫొటోను ట్వీట్​ చేసింది.

శ్రీమంతుడు మూవీలోని "ఊరు చాలా ఇచ్చింది. ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతారు" డైలాగ్​ను భువీకి జోడించింది. "హైదరాబాద్​ ఫ్యాన్స్​ నాకు చాలా ప్రేమని ఇచ్చారు. అత్యుత్తమ ప్రదర్శనతో ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి. లేకుంటే లావైపోతా" అనే క్యాప్షన్​ను పెట్టింది. ఈ పోస్టులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇదీ చదవండి:మనీశ్​.. నిర్దాక్షిణ్యంగా కొట్టాల్సిందే: సన్​రైజర్స్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details