ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందడి పెరుగుతోంది. సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో జట్లన్నీ తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఫ్రాంఛైజీలు.. ఆటగాళ్లతో శిబిరాలు ఏర్పాటు చేశాయి. రాబోయే సీజన్‌లో ఎలా రెచ్చిపోవాలని కోరుకుంటున్నాయో విచిత్రంగా చెబుతున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. జట్టులో విధ్వంసకర ఓపెనర్లు, ఫినిషర్లు ఉన్నప్పటికీ మ్యాచ్ సాంతం ఆడుతూ వారికి అండగా నిలిచే ఆటగాళ్లు అవసరం. టీమ్‌ఇండియా యువ ఆటగాడు మనీశ్‌పాండే.. హైదరాబాద్‌కు ఇదే పాత్రను పోషిస్తున్నాడు. 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగుతూ వికెట్లు పడకుండా అడ్డుకుంటాడు. అవసరమైతే భారీ సిక్సర్లు బాదేస్తూ రెచ్చిపోతాడు.