తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా బౌలింగ్​ ఓ రాకెట్​ సైన్స్​ : ఐఐటీ ఫ్రొఫెసర్​ - బుమ్రా బౌలింగ్​ ఓ రాకెట్​ సైన్స్​

ప్రస్తుతం ఉన్న ప్రపంచ మేటి బౌలర్లలో ఒకరి  పేరు చెప్పమంటే ముందుగా గుర్తొచ్చేది టీమిండియా మిస్టరీ పేసర్​​ జస్ప్రిత్​ బుమ్రానే. డెత్​ ఓవర్లలో బుమ్రా బౌలింగ్​ అస్త్రాలు ఎంతటి అనుభవమున్న బ్యాట్స్​మెన్​ను అయినా తికమకపెడతాయి. అందుకే 2016లో తొలి అంతర్జాతీయ మ్యాచ్​ ఆడిన బుమ్రా ఇప్పుడు వన్డే ప్రపంచ ​ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇవే అంశాలు ఓ ప్రొఫెసర్​ను పరిశోధన వైపు నడిపించాయి.

బుమ్రా బౌలింగ్​ ఓ రాకెట్​ సైన్స్​

By

Published : May 18, 2019, 8:07 PM IST

ఐఐటీ కాన్పూర్​కు చెందిన ప్రొఫెసర్​ సంజయ్​ మిత్తల్​ బుమ్రా బౌలింగ్​పై పరిశోధన చేశారు. జస్ప్రిత్​ బౌలింగ్​లో రివర్స్​ మ్యాగ్నస్​ ఫోర్స్ కలిగి ఉండటమే ఉత్తమ బౌలింగ్​కు సహకరిస్తున్నట్లు వెల్లడించారు.

" బంతిని కిందికి నొక్కిపెట్టేలా వేగంగా బౌలింగ్​ చేయడం వల్ల బ్యాట్స్​మెన్​ త్వరగా ఆ బంతిని ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడతాడు" అని మిత్తల్​ తెలిపారు.

1000 ఆర్పీఎమ్​ ( రొటేషన్​​​ పర్​ మినిట్​)తో 0.1 శాతం బంతిని స్పిన్​ చేయడం అతడి సొంతం. గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతిని కచ్చితంగా అనుకున్న ప్రదేశంలో సంధించగల బౌలర్​ బుమ్రా. బంతిని స్పిన్​ చేస్తూ రివర్స్​ మ్యాగ్నస్​ ఫోర్స్​తో బ్యాట్స్​మెన్లను హడలెత్తిస్తున్నట్లు మిత్తల్​ పేర్కొన్నారు.

బుమ్రా బౌలింగ్​పై అద్భుతమైన ఆర్ట్​

వేగంగా బంతులేయడం, కచ్చితమైన లైన్​ అండ్​ లెంగ్త్​ , ఎటువైపైనా స్వింగ్​ చేయడంలో బుమ్రా దిట్ట. అతడి బౌలింగ్​ వేగానికి 'రివర్స్​ మ్యాగ్నస్​ ఫోర్స్'​ తోడవడం వల్ల బ్యాట్స్​మెన్​ తొందరగా ప్రతిస్పందించేందుకు అవకాశం ఉండదు. అంతేకాకుండా బంతి వేశాకా వేగంగా ముందుకు కచ్చితత్వంతో కదలాలి. దీనివల్లే క్యాచ్​లు, రనౌట్​ వంటి అవకాశాలు ఏర్పడతాయి. ఇవే బ్యాట్స్​మెన్​ను ఔట్​ చేయడానికి బాగా సహకరిస్తాయి. అందుకే వేగంగా స్పందించే బౌలర్లలో బుమ్రా ఒకడనే పేరు వచ్చింది. కొత్త బంతితో రివర్స్​ స్వింగ్​ వేయగలడు. ఇవే బుమ్రాను ప్రస్తుత క్రికెట్​లో అత్యుత్తమ బౌలర్​గా మార్చాయనేది ప్రొఫెసర్​ వాదన.

వన్డే బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో తొలి స్థానంలో ​జస్ప్రిత్​ బుమ్రా

ప్రస్తుతం బుమ్రా వన్డే ర్యాంకింగ్స్​లో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. ఐపీఎల్​లో ముంబయి తరఫున ఆడి ఆ జట్టు నాలుగో టైటిల్​ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 77 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడిన ఈ అహ్మదాబాద్​ ఆటగాడు 82 వికెట్లు తీశాడు. 49 వన్డేల్లో 85 వికెట్లు, 10 టెస్టుల్లో 49 వికెట్లు, 42 టీ20ల్లో 51 వికెట్లు సాధించాడు.

ఐపీఎల్​లో ముంబయి తరఫున బుమ్రా

ABOUT THE AUTHOR

...view details