తెలంగాణ

telangana

ETV Bharat / sports

అశ్విన్​ 6.. అండర్సన్​ 9 వికెట్లు తీస్తే.. - అశ్విన్

బుధవారం నుంచి మొతేరా వేదికగా జరగనున్న గులాబీ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఎవరెవరు ఏయే ఘనతలు అందుకోనున్నారో ఓ సారి చూద్దాం.

The players of both the teams have set many records in the Pink Test.
అరుదైన రికార్డులకు అతి చేరువలో ఆటగాళ్లు

By

Published : Feb 23, 2021, 8:24 PM IST

మొతెరా వేదికగా రేపటి నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. లక్షా పది వేల మందికి సామర్థ్యమున్న ఆ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఇరు జట్లు భీకర పోరుకు సిద్ధమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం కానుంది. అయితే అరుదైన రికార్డులకు కొందరు ఆటగాళ్లు అతి చేరువలో ఉన్నారు. ఆ ఘనతలను మొతెరా వేదికగా నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇంతకీ ఆ రికార్డులేంటంటే..

విరాట్‌కు మరో విజయం..

స్వదేశంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత సారథిగా నిలవడానికి కోహ్లీ మరో విజయం దూరంలో నిలిచాడు. ప్రస్తుతం ఆ జాబితాలో కోహ్లీ, ధోనీ 21 విజయాలతో సమానంగా ఉన్నారు. అయితే విరాట్ 28 టెస్టుల్లో గెలవగా మహీ 30 టెస్టుల్లో సాధించాడు. కాగా, టెస్టుల్లో ఎక్కువ విజయాలు నమోదు చేసిన కెప్టెన్ల జాబితాలో కోహ్లీ (34) ఐదో స్థానంలో ఉన్నాడు. గ్రేమ్‌ స్మిత్ (53), పాంటింగ్‌ (48), స్టీవ్ వా(41), క్లైవ్‌ లాయిడ్‌ (36) మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

విరాట్ కోహ్లీ

37 పరుగులు..

బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ మరో రికార్డుపై కన్నేశాడు. 37 పరుగులు సాధిస్తే టెస్టుల్లో 7500 పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ 89 టెస్టుల్లో 52 సగటుతో 7463 పరుగులు చేశాడు.

అశ్విన్‌కు ఆరు వికెట్లు..

భారత్‌ తరఫున 400 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలవడానికి రవిచంద్రన్ అశ్విన్​కు ఆరు వికెట్లు అవసరం. ఆ ఘనత సాధిస్తే ప్రపంచ క్రికెట్‌లో 400 వికెట్లు మార్క్‌ను అందుకున్న 16వ బౌలర్‌గా యాష్ నిలుస్తాడు.

అశ్విన్​

హిట్‌మ్యాన్‌@2500..

టెస్టుల్లో 2500 పరుగుల మైలురాయిని అందుకోవడానికి రోహిత్ శర్మకు మరో 25 పరుగులు అవసరం.

ఇషాంత్ @100..

కపిల్‌దేవ్‌ తర్వాత 100 టెస్టులు ఆడిన రెండో భారత పేసర్‌గా నిలవడానికి ఇషాంత్ శర్మ మరో మ్యాచ్‌ దూరంలో ఉన్నాడు. అంతేగాక వికెట్ల పరంగానూ లంబూ మరో ఘనతపై కన్నేశాడు. తొమ్మిది వికెట్లు సాధిస్తే జహీర్‌ఖాన్‌ (311)ను అధిగమిస్తాడు. అంతేగాక బ్రెట్ లీ (310), మోర్నీ మోర్కెల్‌ (309) వికెట్లను కూడా అధిగమిస్తాడు. ప్రస్తుతం లంబూ 302 వికెట్లు తీశాడు.

ఇషాంత్ శర్మ

ఇంగ్లాండ్ ఆటగాళ్ల రికార్డులు..

  • అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా నిలవడానికి జేమ్స్ అండర్సన్‌ (611) తొమ్మిది వికెట్ల దూరంలో ఉన్నాడు. మురళీధరన్ (800), షేన్‌వార్న్‌ (708), అనిల్‌ కుంబ్లే (619) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
  • జో రూట్ (20) మరో శతకం సాధిస్తే సెంచరీ జాబితాలో స్ట్రాస్‌ (21)తో సమానంగా నిలుస్తాడు.
  • ఇంగ్లాండ్‌ స్టార్ ప్లేయర్‌ హెర్బర్ట్‌ (4555) పరుగులు అధిగమించడానికి బెన్‌స్టోక్స్‌ (4543)కు 13 పరుగులు అవసరం.

ఇదీ చదవండి:మొతేరా పిచ్​పై కోహ్లీ అంచనాలు ఇలా...

ABOUT THE AUTHOR

...view details