తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమ్ఇండియా ఈ మార్పులు చేయాలి' - శుభ్​మన్ గిల్ సునీల్ గావస్కర్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరపరాభవం పాలైంది టీమ్ఇండియా. దీంతో రెండో మ్యాచ్​లో భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్​లో కొన్ని మార్పులు చేయాలని సూచించాడు మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్.

The inclusion of KL Rahul and Shubman Gill for the second Test can change the picture says
'టీమ్ఇండియా ఈ మార్పులు చేయాలి'

By

Published : Dec 20, 2020, 2:36 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోరపరాభవం ఎదుర్కొంది టీమ్ఇండియా. దీంతో జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాజీల్లో కొంతమంది కోహ్లీసేనకు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈ ఓటమిపై స్పందించిన మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తప్పుల్ని సరిదిద్దుకుని రెండో మ్యాచ్​లో సత్తాచాటాలని సూచించాడు. అలాగే జట్టులో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపాడు.

"తొలి మ్యాచ్​లో ప్రదర్శన పట్ల నిరాశ చెందడం మామూలే. కానీ క్రికెట్​లో ఏమైనా జరగొచ్చు. ఈ సంగతిని గుర్తించి రెండో మ్యాచ్​పై దృష్టిపెట్టాలి. ఆసీస్ బ్యాటింగ్ లైనప్​ కూడా అంత బలంగా ఏమీ లేదు. రెండో మ్యాచ్ కోసం భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్​లో రెండు మార్పులు జరుగుతాయని అనుకుంటున్నా. పృథ్వీ షా స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్​గా రావాలి. అలాగే 5 లేదా 6వ స్థానంలో శుభ్​మన్ గిల్​ను తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరూ మంచి ఫామ్​లో ఉన్నారు. వారు కనుక మెరుగైన ప్రదర్శన చేస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది."

-సునీల్ గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్

అలాగే జట్టులో మార్పులపై మేనేజ్​మెంట్ దృష్టిపెడుతుందని భావిస్తున్నట్లు తెలిపాడు గావస్కర్. ఎవరు ఓపెనర్​గా రావాలో, ఎవరో మిడిలార్డర్​లో రావాలో అనే విషయాన్ని వీలైనంత త్వరగా నిర్ణయించుకోవాలని సూచించాడు.

ABOUT THE AUTHOR

...view details