తెలంగాణ

telangana

ETV Bharat / sports

వాషింగ్టన్ సుందర్​కు ఆ పేరు వచ్చింది అలా - washington sundar ind vs aus

వాషింగ్టన్ సుందర్​.. ఐపీఎల్​ చూసేవాళ్లు ఈ పేరు వినే ఉంటారు. 2017లో పుణె జట్టు​ ఫైనల్​ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు ఆసీస్​తో నాలుగో టెస్టులో బంతి​తో పాటు బ్యాట్​తోనూ అదరగొట్టడం వల్ల మరోసారి వార్తల్లో నిలచాడు. అయితే అతడి పేరు విచిత్రంగా ఉండటం వల్ల దాని గురించి చర్చ జరుగుతోంది. ఇంతకీ అతడికి ఆ పేరు ఎలా వచ్చింది?

The heartwarming story behind Washington Sundar's unique name
అలా అతడు 'వాషింగ్టన్' సుందర్​ అయ్యాడు

By

Published : Jan 17, 2021, 8:23 PM IST

వాషింగ్టన్ సుందర్​.. ఈ పేరు వినగానే ఎవరైనా కొద్దిసేపు ఆలోచించి ఇదేం పేరబ్బా అని కచ్చితంగా అనుకుంటారు! అసలు అలా ఎలా పెట్టారని ఆలోచిస్తారు. అయితే ఈ పేరు వెనకాల ఓ హృద్యమైన కథ ఉంది.

సుందర్, శార్దుల్

వాషింగ్టన్ సుందర్​ వాళ్ల నాన్న ఎమ్.సుందర్. ఆయన​ కూడా క్రికెటర్. కానీ పేదరికం కారణంగా ఆటలో కొనసాగలేకపోయారు. అప్పుడే పొరుగునే ఉండే ఆర్మీ మాజీ అధికారి పీడీ వాషింగ్టన్.. ఆయనకు ఆర్థికంగా సాయం చేసేవారు.

తన చదువుకు ఫీజు కట్టడం, యూనిఫామ్​, పుస్తకాలు కొనివ్వడం, గ్రౌండ్​కు సైకిల్​పై తీసుకెళ్లడం లాంటివి చేసేవారు. క్రికెట్​పైన మక్కువతో వీరు ఆడే ఆటను ఇష్టంగా చూసేవారు వాషింగ్టన్.

ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్ర స్థాయి వరకు ఆడాడు ఎమ్.సుందర్. అందులో వాషింగ్టన్​ పాత్ర ఎంతో ఉంది. అందుకు కృతజ్ఞతగా ఆయన జ్ఞాపకార్థంగా, తన తొలిబిడ్డకు వాషింగ్టన్​ పేరు పెట్టుకున్నారు ఎమ్.సుందర్.

1999లో వాషింగ్టన్ సుందర్​ పుట్టడానికి కొన్ని నెలల ముందే పీడీ వాషింగ్టన్ చనిపోయారు. తనకు ఇంకో కొడుకు పుట్టి ఉంటే అతడికి జూనియర్​ వాషింగ్టన్ అని పెట్టేవాడినని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఎమ్. సుందర్.

ఇదీ చూడండి:చూడకుండానే సిక్స్ కొట్టిన సుందర్

ABOUT THE AUTHOR

...view details