మరింత బలంగా తిరిగి వస్తానని గాయపడ్డ భారత బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. భుజం గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ పాటు ఐపీఎల్ మొత్తానికి దూరమైన అతడు.. గురువారం బయో బబుల్‌ను వీడి ఇంటికి వెళ్లిపోయాడు.
అంతే బలంగా త్వరలో తిరిగొస్తా: శ్రేయస్ - క్రికెట్ న్యూస్
తనకైన గాయం గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. అభిమానుల మద్దతు, ప్రేమ తనకెంతో సంతోషాన్నిచ్చాయని చెప్పాడు.
అంతే బలంగా.. త్వరలో తిరిగొస్తా: శ్రేయస్
"ఎంత పెద్ద ఎదురుదెబ్బ తగిలితే అంత బలంగా పునరాగమనం ఉంటుంది. నేను త్వరగానే తిరిగొస్తా" అని శ్రేయస్ ట్వీట్ చేశాడు.
"నేను మీ సందేశాలు చుదువుతూనే ఉన్నా. మీ ప్రేమ, మద్దతు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. అందరికీ కృతజ్ఞతలు" అని శ్రేయస్ చెప్పాడు. ఐపీఎల్ అనంతరం ఇంగ్లిష్ కౌంటీ జట్టు లాంక్‌షైర్ తరఫున ఇతడు వన్డే టోర్నీ ఆడాల్సి ఉంది. గాయం వల్ల అతడు ఆ టోర్నీకి కూడా దూరమైనట్లే. శ్రేయస్ గైర్హాజరీలో స్మిత్, అశ్విన్, పంత్‌లలో ఒకరు దిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించే అవకాశముంది.
Last Updated : Mar 26, 2021, 10:38 AM IST