తెలంగాణ

telangana

ETV Bharat / sports

మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు: శ్రేయస్ - గాయంపై శ్రేయస్ అయ్యర్ ట్వీట్

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో గాయపడిన టీమ్ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మిగితా సిరీస్​కు దూరమయ్యాడు. తాజాగా తన గాయంపై స్పందించిన శ్రేయస్.. త్వరలోనే మళ్లీ జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Shreyas Iyer
శ్రేయస్

By

Published : Mar 25, 2021, 3:54 PM IST

ఇంగ్లాండ్​తో తొలి వన్డేలో గాయపడ్డ శ్రేయస్​ అయ్యర్.. సిరీస్​కు పూర్తిగా దూరమయ్యాడు. అలాగే అతడు ఐపీఎల్​కూ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా తన గాయంపై స్పందించిన శ్రేయస్.. అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ సందేశం ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ జట్టులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"మీరు చేసిన మెసేజ్​లను చదివా. నాపై మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. త్వరలోనే దృఢంగా మళ్లీ తిరిగొస్తాను."

-శ్రేయస్ అయ్యర్, టీమ్ఇండియా క్రికెటర్

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్​​ 8వ ఓవర్లో బెయిర్​ స్టో కొట్టిన బంతిని ఆపే క్రమంలో శ్రేయస్​ డైవ్​ చేయగా.. అతడి చేయి నేలను బలంగా తాకింది. శ్రేయస్​ భుజం కొంతమేర డిస్​లొకేట్​ అయ్యింది. దీనికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. సమస్య తీవ్రమైతే ఆ గాయానికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది అని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details