విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉంటూనే, బ్యాటింగ్‌లోనూ ఎవరికీ సాధ్యం కాని రికార్డులను సృష్టిస్తున్నాడు. కొత్త ఘనతలు సాధిస్తున్నాడు. అలాంటి కోహ్లీని టీనేజ్‌లో ఉండగా ఓ సారి రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయలేదు. దీంతో ఉదయం 3 గంటల వరకూ ఏడుస్తూ కూర్చున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఆన్లైన్ సెషన్లో వెల్లడించాడు.
రిజెక్టు చేసినందుకు ఉదయం 3 వరకు ఏడ్చిన కోహ్లీ - Sports and Coronavirus
కెరీర్ ప్రారంభంలో బాగా ఆడినా సరే, రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనందుకు చాలా బాధపడ్డాడని వెల్లడించాడు కోహ్లీ. అప్పుడు జరిగిన సంఘటనను తాజాగా గుర్తు చేసుకున్నాడు.
"కెరీర్ ప్రారంభించిన తొలిసారి దిల్లీ జట్టు సెలక్షన్స్‌లో నాకు ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్స్‌లో నన్ను ఎంపిక చేయలేదు. ఆరోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. ఎందుకంటే నేను అప్పటికే మైరుగైన స్కోర్లు చేసి ఉండటం వల్ల టీమ్‌లోకి తీసుకుంటారని అనుకున్నా. కానీ రిజెక్టు చేయడాన్ని తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత కోచ్‌తో మాట్లాడి ఇంటికెళ్లాను. ఇలా ఎందుకు జరిగింది? అని తీవ్రంగా ఆలోచిస్తూ బాధపడ్డాను. అయితే ఆటపై ఉన్న అంకితభావం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది" -కోహ్లీ, టీమిండియా కెప్టెన్
2008లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన విరాట్.. 2014లో టెస్టు పగ్గాలు అందుకున్నాడు. ఆ తర్వాత 2017లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2019-19 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్ గెలిచి ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెట్ జట్టు సారథిగా నిలిచాడు.