తెలంగాణ

telangana

ETV Bharat / sports

కమ్మేస్తున్న కరోనా.. ఐపీఎల్​లో పెరుగుతున్న కేసులు - కరోనా

ఐపీఎల్​కు సమయం దగ్గర పడుతున్న వేళ కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లతో పాటు లీగ్​తో సంబంధమున్న పలువురికి కొవిడ్ నిర్ధరణ అయింది. ముంబయిలో కేసులు పెరుగుతున్నప్పటికీ.. వాంఖడే వేదికగా టోర్నీ కొనసాగుతుందని బీసీసీఐ చెబుతోంది. ఈ నేపథ్యంలో.. రాత్రి 8 గంటల తర్వాత వాంఖడే స్టేడియంలో సాధన చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది.

The corona epidemic is spreading fast as the time draws near for the IPL
కమ్మేస్తున్న కరోనా.. ఐపీఎల్​లో పెరుగుతున్న కేసులు

By

Published : Apr 6, 2021, 7:30 AM IST

ఐపీఎల్‌ను కరోనా కమ్మేస్తోంది.. ఇప్పటికే ఇద్దరు ఆటగాళ్లతో పాటు పది మంది మైదాన సిబ్బందికి వచ్చిన ఈ మహమ్మారి.. తాజాగా బయో బబుల్లో​ ఉన్న 14 మంది ప్రసార సిబ్బందికి కూడా సోకింది. ముంబయిలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌లో విడిది చేసిన స్టార్‌ స్పోర్ట్స్‌కు చెందిన సభ్యులకు పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. వీరిలో కెమెరామెన్‌, డైరెక్టర్లు ఈవీఎస్‌ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లు ఉన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఒకటికి మించి బయో బబుల్ల​ను ఏర్పాటు చేసింది. కానీ ఈ మహమ్మారి మాత్రం చాపకింద నీరులా చొరబడుతోంది. అయితే కరోనా వ్యాప్తిపై అధికారిక ప్రసారదారు స్టార్‌ స్పోర్ట్స్‌తో పాటు ఇతర వ్యాపార భాగస్వాములు కూడా బీసీసీఐ ముందు తమ ఆందోళన వ్యక్తం చేశాయి.

ఇదీ చదవండి:నిజజీవిత 'జెర్సీ'.. సీఎస్కేలో తెలుగు కుర్రాడి కథ

కొవిడ్‌ కేసులు భారీగా నమోదవుతున్నా ముంబయిని ఐపీఎల్‌ వేదికగానే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. కానీ పరిస్థితి తీవ్రత చూస్తే మ్యాచ్‌లు సజావుగా సాగుతాయో లేదో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. క్రికెటర్లు అక్షర్‌ పటేల్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌కు ఇప్పటికే కరోనా ఉన్నట్లు తేలింది. మున్ముందు ఇంకెంత మంది బయటపడతారో అనే ఆందోళనలు ఉన్నాయి. అయితే బయో బుడగ సురక్షితమని.. షెడ్యూల్‌ ప్రకారమే ముంబయిలో మ్యాచ్‌లు జరుగుతాయని బోర్డు అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టం చేశాడు.

రాత్రి 8 గంటల తర్వాతే ప్రాక్టీస్‌

కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా ఐపీఎల్‌ పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్‌ జట్లు రాత్రి 8 గంటల తర్వాత వాంఖడే స్టేడియంలో సాధన చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. భారీగా కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో ముంబయిలో రాత్రి కర్ఫ్యూ ఉంది. అయితే కఠినమైన బయో బబుల్​ నిబంధనలకు లోబడి క్రికెటర్లు సాధన చేయనున్నారు.

ఇదీ చదవండి:బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్​గా మాజీ డీజీపీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details