భారత క్రికెట్ బోర్డు నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరభ్ గంగూలీ ఎన్నిక లాంఛనమైంది. ఇదే జరిగితే 65 ఏళ్ల అనంతరం బీసీసీఐ అత్యున్నత పదవి చేపట్టిన మొదటి భారత క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకుంటాడు దాదా. అంతకుముందు విజయనగరం మహారాజా, మాజీ ఆటగాడు విజ్జీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించాడు,
ఎవరీ తెలుగుబిడ్డ..?
విజ్జీ అసలు పేరు పూసపాటి విజయానంద గజపతిరాజు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో జన్మించిన ఈయన 1936లో భారత్ తరపున మూడు టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 1954 నుంచి 1956 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశాడు.
విజ్జీ తర్వాత సునీల్ గావస్కర్, శివలాల్ యాదవ్ ఈ పదవిలో సేవలందించారు. అయితే వీరిద్దరూ పూర్తి కాలం బాధ్యతలు నిర్వర్తించలేదు. 2014లో తాత్కాలికంగానే పనిచేశారు. ఈ నెల 23న జరిగే ఎన్నికల్లో గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైతే... పూర్తి కాలానికి ఆ పదవి చేపట్టిన రెండో భారత క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకుంటాడు.
నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారమే ఆఖరి రోజు. బోర్డు కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి తనయుడు జై షా... కోశాధికారిగా అరుణ్ ధూమల్ బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోదరుడే ధూమల్.
ఇదీ చదవండి: 'భారత క్రికెట్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది'