తెలంగాణ

telangana

ETV Bharat / sports

అఫ్గానిస్థాన్​ 'ధోనీ'పై నిషేధం తొలగింపు - sports news

వికెట్​ కీపర్​ బ్యాట్స్​మన్ మహ్మద్​ షెజాద్​పై విధించిన నిషేధాన్ని తొలగించింది ఆఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు. యధావిధిగా క్రికెట్ ఆడొచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.

అఫ్గానిస్థాన్​ 'ధోనీ'పై నిషేధం తొలగింపు
వికెట్​ కీపర్​ బ్యాట్స్​మన్ మహ్మద్​ షెజాద్

By

Published : Feb 26, 2020, 5:00 PM IST

Updated : Mar 2, 2020, 3:47 PM IST

అఫ్గానిస్థాన్​​ జట్టులో ధోనీగా పేరు తెచ్చుకున్న మహ్మద్​ షెజాద్​పై నిషేధాన్ని ఎత్తివేసింది ఆ దేశ క్రికెట్ బోర్డు(ఏసీబీ). మళ్లీ యధావిధిగా ఆడొచ్చని క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. కానీ కాంట్రాక్ట్​పై బ్యాన్​.. ఈ ఏడాది ఆగస్టు వరకు ఉంటుందని తన ట్విట్టర్​లో పేర్కొంది.

నియమ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా షెజాద్​.. ఏడాదిపాటు ఎటువంటి క్రికెట్​ ఆడకూడదంటూ గతేడాది ఆగస్టులో స్పష్టం చేసింది ఏసీబీ. కానీ, ఏడు నెలల తర్వాత క్రమశిక్షణ కమిటీ అతడిపై నిషేధాన్ని తొలగించింది.

గతేడాది ఇంగ్లాండ్​లో జరిగిన ప్రపంచకప్ మధ్యలో మోకాలి గాయం కారణంగా షెజాద్​.. జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే తనను ఉద్దేశపూర్వకంగానే తప్పించారని, తనకేం గాయం కాలేదని చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.​

అఫ్గానిస్థాన్ క్రికెటర్ మహ్మద్ షెజాద్
Last Updated : Mar 2, 2020, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details