తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీని ఔట్ చేసిన ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి - ebadat vollyball

ఈడెన్ గార్డెన్స్​లో జరుగుతున్న డే/నైట్ టెస్టులో విరాట్ కోహ్లీ వికెట్ తీసిన బంగ్లా బౌలర్ ఇబదత్ హొస్సేన్.. మర్యాదపూర్వక సెల్యూట్​తో ఆకర్షించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్​లో పనిచేస్తున్నట్లు చెబుతూ, సెల్యూట్​ చేయడం వెనకున్న కారణాన్ని వెల్లడించాడు.

విరాట్ కోహ్లీ

By

Published : Nov 24, 2019, 11:57 AM IST

Updated : Nov 24, 2019, 1:06 PM IST

ఇబదత్ హొస్సేన్.. భారత కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వికెట్ తీసి, మర్యాదపూర్వక సెల్యూట్​తో అందరినీ ఆకర్షించాడు. డే/నైట్ టెస్టులో మొదటి రోజు పుజారాను ఔట్ చేసి, ఇదే రీతిలో సెండాఫ్ ఇచ్చాడు. ఈ బౌలర్ ప్రస్తుతం బంగ్లాదేశ్​ వాయుదళం(ఎయిర్​ఫోర్స్)​లో పనిచేస్తున్నాడట. క్రీడా కోటాలో అక్కడే ఉద్యోగం తెచ్చుకున్నాడట. ఈ విషయాన్నే అతడే స్వయంగా చెప్పాడు.

ఇబదత్ హొస్సేన్

"నేను బంగ్లాదేశ్ ఎయిర్​ఫోర్స్​లో పనిచేస్తున్నా. వికెట్ తీసిన తర్వాత వేడుక చేసుకోవడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే ఫస్ట్​క్లాస్ క్రికెట్ ఆడుతున్నప్పుడు, వికెట్ తీసిన తర్వాత సెల్యూట్ చేయమని బంగ్లా ఆల్​రౌండర్ మహ్మదుల్లా రియాద్ నాతో చెప్పాడు. ఇది నా బ్రాండ్​గా మిగులిపోతుందని అన్నాడు. అప్పటి నుంచి వికెట్ తీసిన ప్రతిసారి ఇలా చేస్తున్నా" -ఇబదత్ హొస్సేన్, బంగ్లా బౌలర్.

క్రీడా విభాగంలో అతడికి వచ్చిన ఉద్యోగం.. క్రికెట్ నుంచి కాకుండా వాలీబాల్ తరఫున వచ్చిందట. ఇప్పటికీ ఎయిర్​ఫోర్స్​ జట్టు తరఫున వాలీబాల్ ఆడుతున్నాడు ఇబదత్. ఈ కారణంతోనే బంగ్లా క్రికెట్ జట్టులో ఎంపికైన ప్రతిసారి వాయదళం నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుంటున్నాడు.

ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో 136 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. ఇబదత్ బౌలింగ్​లో భారీ షాట్​కు యత్నించాడు. బౌండరీ లైన్​ వద్ద ఉన్న తైజుల్ ఇస్లామ్​ అద్భుత క్యాచ్​తో పెవిలియన్ చేరాడు. అనంతరం 347/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసిందిభారత్. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా.. 152 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది. తొలి ఇన్నింగ్స్​లో 5 వికెట్లు తీసిన ఇషాంత్, రెండో ఇన్నింగ్స్​లోనూ 4 వికెట్లతో సత్తా చాటాడు.

ఇదీ చదవండి: వాట్లింగ్ డబుల్ సెంచరీ.. కివీస్ భారీ స్కోరు

Last Updated : Nov 24, 2019, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details