తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో టెస్టు సిరీస్ నోరూరిస్తుంది: పైన్ - Teaindia Test Series

నవంబర్​లో టీమిండియాతో జరగనున్న 4 మ్యాచ్​ల టెస్టు సిరీస్ నోరూరిస్తుందని ఆసీస్ సారథి టిమ్​పైన్ చెప్పాడు. గతేడాది ఓటమి పాలైనప్పటికీ ప్రస్తుతం తాము మంచి ఫామ్​లో ఉన్నట్లు తెలిపాడు.

Test series against India going to be mouth-watering: Tim Paine
టిమ్​ పైన్​

By

Published : Jan 7, 2020, 9:02 AM IST

పాకిస్థాన్, ఇంగ్లాండ్.. తాజాగా న్యూజిలాండ్ ఇలా వరుస టెస్టు సిరీస్ విజయాలతో దూసుకెళ్తోంది ఆస్ట్రేలియా. టెస్టు ఛాంపియన్​షిప్​లో 296 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఆసీస్.. భారత్​తో​ సిరీస్​ కోసం ఉవ్విళ్లూరుతోంది. కంగారూ జట్టు టెస్టు కెప్టెన్ టిమ్​ పైన్​ కూడా దీనిపై స్పందించాడు. టీమిండియాతో టెస్టు సిరీస్​ నోరూరిస్తుందని చెప్పాడు.

ఆసీస్​లో గతేడాది 2-1 తేడాతో టెస్టు సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది టీమిండియా. అయితే ప్రస్తుతం ఆసీస్ జట్టు బలంగా ఉందని తెలిపాడు పైన్.

"గతేడాది భారత్​పై టెస్టు సిరీస్ ఓడాం. అయితే ప్రస్తుతం పరిస్థితి మారింది. కొన్ని నెలలుగా మంచి ఫామ్​లో ఉన్నాం. ఇదే విజయాలు భవిష్యత్తులోనూ కొనసాగించాలనుకుంటున్నాం. ఇరు జట్లు బలంగా ఉన్నాయి. ఇది అద్భుతమైన సిరీస్ అవుతుందని అనుకుంటున్నా. ముందుగా బంగ్లాదేశ్​తో ఆ దేశంలో టెస్టు సిరీస్ ఆడనున్నాం. అనంతరం స్వదేశంలో భారత్​తో తలపడనున్నాం. ఈ సిరీస్ అభిమానులకు, ఆటగాళ్లకు మజానిస్తుంది." -టిమ్​ పైన్, ఆసీస్ టెస్టు కెప్టెన్.

జూన్​లో బంగ్లాదేశ్​తో రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా. నవంబరులో టీమిండియాతో స్వదేశంలో 4 మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో తలపడనుంది.

సోమవారం న్యూజిలాండ్​తో జరిగిన మూడో టెస్టులో 279 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆసీస్. ఫలితంగా 3-0 తేడాతో సిరీస్ క్లీన్​స్వీప్ చేసింది. తాజా విజయంతో టెస్టు ఛాంపియన్​షిప్​లో 296 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 360 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో ఉంది.

ఇదీ చదవండి: 100 మీటర్ల హర్డిల్స్​లో 'తెలుగమ్మాయి' జాతీయ రికార్డు

ABOUT THE AUTHOR

...view details