పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్ బోర్డు. మూడు మ్యాచ్‌ల కోసం 14 మందితో జట్టును ప్రకటించారు. ఇందులో ప్రస్తుతం టెస్టుల్లో ఆడుతున్న ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఆగస్టు 28 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా పొట్టి సిరీస్ ప్రారంభం కానుంది.
ఇంగ్లీష్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. మిడిల్‌ఎసెక్స్ ఆల్‌రౌండర్ లియామ్ డావ్సన్, జేమ్స్ విన్స్ ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేరు.
" ప్రస్తుతం టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లను బయో బబుల్ కారణంగా టీ20లకు ఎంపిక చేయలేదు. మూడో టెస్టు మూడు రోజుల తర్వాత టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మల్టీ ఫార్మాట్ ప్లేయర్లకు కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశం ఇస్తున్నాం. త్వరలోనే ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్టును ప్రకటిస్తాం" అని సెలక్టర్ స్మిత్ చెప్పారు.