తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పదవీకాలం మించి ఎవరూ కొనసాగలేరు'

బీసీసీఐ సెలక్షన్​ కమిటీ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఈ ప్యానెల్​ పదవీకాలం మగిసిందని 88వ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.

Tenures are finished: Ganguly on Prasad-led selection panel
'పదవీకాలం మించి ఎవరూ కొనసాగలేరు'

By

Published : Dec 2, 2019, 6:11 AM IST

Updated : Dec 2, 2019, 6:52 AM IST

ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ​ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ మాట్లాడుతూ.. పదవీకాలం దాటి ఎవరూ కొనసాగలేరని పేర్కొన్నాడు. బోర్డు 88వ వార్షిక సర్వసభ్య సమావేశంలో దాదా ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఎమ్మెస్కే ప్రసాద్​ ప్యానెల్​ పదవీవిరమణ విషయంలో బీసీసీఐ పాత రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం విధానంలో గరిష్టంగా ఐదేళ్ల కాలపరిమితి ఉంది. గతంలో ఇది నాలుగేళ్ల వరకు ఉండేది.

ఈ కమిటీలోని సభ్యులుగా ఎమ్మెస్కే ప్రసాద్​, గగన్​ ఖోడా 2015లో చేరారు. జతిన్​ పరంజ్​పే, శరణ్​దీప్​ సింగ్, దేవాంగ్​ గాంధీలు 2016లో ప్యానెల్​లో కలిశారు. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం సభ్యులంతా ఇకపై కొనసాగలేరని గంగూలీ స్పష్టం చేశాడు. వారు మంచి సేవలందించారని అన్నాడు.

అయితే ఈ ఐదుగురు సభ్యుల ప్యానెల్ హయాంలో టీమిండియా అద్భుతంగా రాణించింది. అదే సమయంలో కమిటీ సభ్యుల వ్యక్తిగత కెరీర్​ గురించి ట్రోలింగ్స్ జరిగాయి.

ఇది చదవండి: లారా రికార్డు బ్రేక్​ చేయాలంటే అతడికే సాధ్యం: డేవిడ్ వార్నర్

Last Updated : Dec 2, 2019, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details