తెలంగాణ

telangana

ETV Bharat / sports

వారికి సంఘీభావంగా సచిన్ పుట్టినరోజు వేడుకలు రద్దు - సచిన్ తెందుల్కర్ వార్తలు

కరోనాపై పోరాటం సాగిస్తున్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు తదితరులకు సంఘీభావం తెలుపుతూ దిగ్గజ క్రికెటర్ సచిన్.. తన పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకున్నారు.

Tendulkar will not celebrate 47th birthday as mark of respect to COVID-19 warriors
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్

By

Published : Apr 23, 2020, 11:26 AM IST

Updated : Apr 23, 2020, 12:19 PM IST

దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్.. రేపు(శుక్రవారం) తన పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోకూడదని అనుకున్నాడు. కరోనా కట్టడి కోసం పోరాడుతున్న సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. ఈ వైరస్​ వ్యాప్తిని అరికట్టటంలో భాగంగా ఇప్పటికే రూ.50 లక్షలు విరాళం ప్రకటించాడు మాస్టర్.

'సచిన్ బర్త్​డే చేసుకునేందుకు ఇది సరైన సమయం కాదు. తమ ప్రాణాలు పణంగా పెట్టి కరోనా కట్టడి కోసం పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీసులు, డిఫెన్స్ వారికి మాస్టర్​ మద్దతుగా నిలవాలని మాస్టర్ అనుకుంటున్నారు' అని అతడి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు.

దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్

అయితే సచిన్ పుట్టినరోజున అతడి 40 అరుదైన ఫొటోలు విడుదల చేసేందుకు ఓ అభిమాన సంఘం సిద్ధమవుతుండగా, ఇన్నేళ్లలో మాస్టర్ చేసిన సహాయ కార్యక్రమాల్ని హైలెట్ చేసేందుకు మరో ఫ్యాన్ క్లబ్ రెడీ అవుతోంది.

Last Updated : Apr 23, 2020, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details