అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ తెందుల్కర్ వీడ్కోలు పలికి సోమవారానికి(నవంబరు 16) ఏడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఓ వీడియోను ట్వీట్ చేసిన మాస్టర్... వెస్టిండీస్‌పై భారత్ తరపున ఆడిన చివరి టెస్టు తర్వాత బ్రియాన్ లారా, క్రిస్ గేల్ తనకు ప్రత్యేక బహుమతిని అందించారని చెప్పాడు.
"సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున వెస్టిండీస్ జట్టుతో పాటు నా స్నేహితులైన బ్రియాన్ లారా, క్రిస్ గేల్ ఈ అందమైన స్టీల్ డ్రమ్‌ను నాకు బహుకరించారు. ఇలాంటి అద్భుతమైన బహుమతికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. వారి ప్రేమా అభిమానాలకు, బీసీసీఐ ధన్యావాదాలు"
- సచిన్ తెందుల్కర్, దిగ్గజ క్రికెటర్
బ్రియాన్ లారా తన ఇంటికి వచ్చినప్పుడు డ్రమ్‌ను వాయించాడని సచిన్ తెలిపాడు. లారాను అనుసరిస్తూ డ్రమ్‌ను మోగిస్తున్నానని తెలిపాడు.
2013 నవంబరు 16న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్‌పై సచిన్ తన చివరి, 200వ టెస్టు ఆడాడు. ఈ మ్యాచ్ అనంతరం అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు మాస్టర్ ప్రకటించాడు. ఈ పోరులో మాస్టర్ 74 పరుగులు చేసి ఔటయ్యాడు. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేయనుందుకు సచిన్ చాలా బాధపడ్డాడు. ఈ క్రమంలోనే చేసిన అతడి ప్రసంగం క్రికెట్ అభిమానుల మదిలో ఎప్పటికీ అలానే నిలిచిపోతుంది.