అంపైర్ కాల్ కారణంగా బ్యాట్స్‌మన్‌కు జీవనదానం ఇవ్వడం సరికాదని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ అన్నాడు. బౌలింగ్ జట్టు సమీక్ష కోరినప్పుడు బంతి కొద్దిగా స్టంప్స్‌కు తాకుతున్నట్లు కనిపించినా బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటించాలని మాస్టర్ ఐసీసీని కోరాడు.
"బంతి ఎంత శాతం స్టంప్స్‌ను తాకుతుందన్నది అనవసరం. డీఆర్ఎస్లో బంతి స్టంప్స్‌ను కొద్దిగా తాకుతున్నట్లు కనిపించినా బ్యాట్స్‌మన్‌ను ఔట్‌గా ప్రకటించాల్సిందే. ఆన్‌ఫీల్డ్ అంపైర్ బ్యాట్స్‌మన్‌ను నాటౌట్‌గా ప్రకటించినా అతడి నిర్ణయాన్ని సవరించి ఔటివ్వాలి. డీఆర్ఎస్లో భాగంగా బంతి 50 శాతానికి పైగా స్టంప్స్‌ను తాకినప్పుడే ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవరిస్తున్నారు. అది సరికాదు."