తెలంగాణ

telangana

ETV Bharat / sports

అక్కడి పిల్లల వైద్యం కోసం.. సచిన్​ సాయం - సచిన్​ తెందుల్కర్​

​ పేద చిన్నారుల వైద్యం కోసం సచిన్​ తెందుల్కర్​ మరోసారి ముందుకొచ్చాడు. అసోంలోని ఓ ఛారిటబుల్​ ఆసుపత్రికి వైద్య పరికరాలను అందజేశాడు. దీని వల్ల ఆ ప్రాంతంలోని రెండు వేల మంది పిల్లలకు తక్కువ ధరలో వైద్యం అందనుంది.

Tendulkar donates medical equipments to Assam hospital
అక్కడి పిల్లల వైద్యం కోసం.. సచిన్​ సాయం

By

Published : Nov 13, 2020, 8:22 PM IST

క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందుల్కర్​ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. యూనిసెఫ్​ గుడ్​విల్​కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. అసోంలోని ఓ ఛారిటబుల్​ ఆసుపత్రికి వైద్య పరికరాలను అందజేశాడు. సచిన్​ సాయం వల్ల రెండువేల మంది పేద చిన్నారులు లబ్ధి పొందనున్నారు. కరీంగంజ్​ జిల్లా ముకుంద ఆసుపత్రిలో పిల్లల అత్యవసర విభాగానికి, శిశు అత్యవసర చికిత్స విభాగానికి ఈ పరికరాలను అందించాడు సచిన్​.

సచిన్​ సాయం పట్ల ముకుంద ఆసుపత్రికి చెందిన పిల్లల శస్త్రచికిత్స నిపుణుడు డా.విజయ్​ ఆనంద్​ ఇస్మాయల్​ కృతజ్ఞతలు చెప్పారు. తెందుల్కర్​ ఫౌండేషన్, ఏకం ఫౌండేషన్​ సహకారంతో ఆ ప్రాంతంలోని పేదలకు తక్కువ ధరలోనే ఉత్తమ వైద్యం అందించగలుగుతామని అన్నారు.

తెందుల్కర్​ ఫౌండేషన్ తరఫున మధ్యప్రదేశ్​లోని గిరిజన వర్గాల ప్రజలకు పోషకాహారాన్ని అందించడంలోనూ సచిన్​ సహాయపడ్డాడు. ఈ కార్యక్రమం సాయంతో ఈశాన్య రాష్ట్రాల్లోని ఎంతో మంది పేదలు లబ్ధి పొందారు.

ఇదీ చదవండి:నేను చూసిన వారిలో కోహ్లీ ది బెస్ట్: ఆస్ట్రేలియా కోచ్

ABOUT THE AUTHOR

...view details