పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ వేసిన బౌన్సర్లకు క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ ఇబ్బంది పడ్డాడని ఆ దేశ మాజీ పేసర్ మహ్మద్ ఆసిఫ్ అన్నాడు. 2006లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన భారత్ సిరీస్‌ను గుర్తుచేసుకున్నాడీ బౌలర్. ఈ సిరీస్‌లో ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు.
మహ్మద్ ఆసిఫ్.. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా గతంలో ఏడేళ్ల పాటు సస్పెన్షన్ అనుభవించాడు.
"2006లో పాకిస్థాన్‌కు వచ్చిన భారత జట్టు మంచి బ్యాటింగ్ లైనప్‌తో వచ్చింది. ధోనీ ఏడో, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. ఫైసలాబాద్ టెస్టులో ఇరు జట్లు 600 పరుగులు చేశాయి. ద్రవిడ్, సెహ్వాగ్ దూకుడుగా ఆడారు. భారత జట్టును చూసి మేము కొంత భయపడ్డాం. ఇర్ఫాన్ పఠాన్ మొదటి ఓవర్లనే హ్యాట్రిక్ సాధించాడు. క్రమంగా మాలో ధైర్యం కోల్పోతున్నాం. మేము సుమారు 240 పరుగులు చేసి.. బౌలింగ్ ప్రారంభించగా అక్తర్ ఎక్స్‌ప్రెస్ వేగంతో బౌలింగ్ చేశాడు. అప్పుడు క్రీజ్‌లో ఉన్న సచిన్ భయంతో రెండు సార్లు కళ్లు మూసుకున్నాడు".