తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోని కుమార్తెను బెదిరించిన యువకుడు అరెస్ట్​ - IPL 2020

ఇటీవలే సామాజిక మాధ్యమాల వేదికగా మహేంద్ర సింగ్​ ధోని కుమార్తెకు అసభ్యకర రీతిలో బెదిరింపులు వచ్చాయి. తాజాగా.. ఈ ఘటనకు సంబంధించిన ఓ 16ఏళ్ల యువకుడిని గుజరాత్​ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపులకు పాల్పడినట్టు ఆ యువకుడి అంగీకరించాడని వారు స్పష్టం చేశారు.

Teenager held for issuing threats against MS Dhoni's daughter
ధోని కుమార్తెను బెదిరించిన యువకుడు అరెస్ట్​

By

Published : Oct 11, 2020, 11:12 PM IST

Updated : Oct 11, 2020, 11:23 PM IST

భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోని కుమార్తెపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని గుజరాత్​ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడు 16ఏళ్ల యువకుడని పేర్కొన్నారు.

"కొన్ని రోజుల క్రితం.. ధోని కుమార్తెకు అసభ్యకరమైన రీతిలో బెదిరింపులు వచ్చాయి. ధోని భార్య సాక్షికి.. తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో ఈ బెదిరింపులు అందాయి. ఇందుకు సంబంధించి.. 12వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నాం."

-- సౌరభ్​ సింగ్​, కుచ్​ ఎస్​పీ.

ఐపీఎల్​ 2020లో జరిగిన కేకేఆర్​-సీఎస్​కే మ్యాచ్​ అనంతరం తానే బెదిరింపులకు పాల్పడినట్టు ఆ యువకుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

యువకుడికి సంబంధించిన వివరాలను రాంచీ పోలీసులు తమతో పంచుకున్నట్టు సౌరభ్​ సింగ్​ వెల్లడించారు. వారి వివరాల ప్రకారం నిందితుడు ఈ వ్యక్తేనని ధ్రువీకరించినట్టు స్పష్టం చేశారు. త్వరలోనే అతడిని రాంచీ పోలీసులకు అప్పజెప్పనున్నట్టు తెలిపారు.

ఇదీ చూడండి:-మనీశ్ ఖాతాలో మూడు వేల ఐపీఎల్ పరుగులు

Last Updated : Oct 11, 2020, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details