తెలంగాణ

telangana

ETV Bharat / sports

యువ క్రికెటర్లలో ఆ విషయం లోపించింది: సచిన్ - duleep trophy cricketers

యువ క్రికెటర్లలో జట్టు స్ఫూర్తి లోపించిందని దిగ్గజ సచిన్ తెందూల్కర్ అభిప్రాయపడ్డాడు. దులీప్ ట్రోఫీలో ఆటగాళ్లు, వ్యక్తిగత ప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చారని అన్నాడు. ఈ అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ దృష్టి సారించాలని సూచించాడు.

Team spirit missing in Duleep Trophy, hope Ganguly revamps it: Tendulkar
గంగూలీ - సచిన్

By

Published : Nov 26, 2019, 6:15 PM IST

Updated : Nov 26, 2019, 6:45 PM IST

సౌరభ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడేదేశవాళీ క్రికెట్​ను ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని చెప్పాడు. తాజాగా ఈ అంశాన్ని దాదాకు మరోసారి గుర్తుచేశాడు దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్. కుర్రాళ్లలో జట్టు స్ఫూర్తి లోపించిందని, ఫస్ట్​క్లాస్ క్రికెట్​పైనా దృష్టిపెట్టాలని గంగూలీకి మాస్టర్ సూచించాడు.

"దులీప్ ట్రోఫీపై గంగూలీ దృష్టిపెట్టాల్సిందిగా కోరుతున్నా. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో యువ క్రికెటర్లు.. జట్టుగా ఆడడాన్ని విస్మరించారు. వ్యక్తిగత ప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చారు. ఐపీఎల్ వేలం, టీ20 ప్రపంచకప్, వన్డే సిరీస్​లు లాంటి వాటినే యువ క్రికెటర్లు దృష్టిలో పెట్టుకొని ఆడుతున్నారు" -సచిన్ తెందూల్కర్.

క్రికెట్ అనేది జట్టుగా ఆడాల్సిన ఆటని మాస్టర్ బ్లాస్టర్​ సచిన్ అన్నాడు.

"దులీప్ ట్రోఫీని పునరుద్ధరించాలంటే ఓ మార్పు తప్పనిసరిగా చేయాలి. క్రికెట్​ అనేది జట్టుగా ఆడాల్సిన ఆట. కలిసికట్టుగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్లకు ప్రాధాన్యమివ్వాలి. రంజీ ఫైనల్లో తలపడిన వాటినే కాకుండా, సెమీస్ వరకు వచ్చిన నాలుగు జట్లనూ పరిశీలించాలి. ఈ విధంగా వివిధ టీమ్​ల్లో ప్రతిభ గల ఆటగాళ్లను ఎంపిక చేయాలి. అండర్-19, అండర్-23లోని యువ క్రికెటర్లనూ పరిశీలించాలి. ఇలా చేస్తే అత్యుత్తమ ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారు" -సచిన్ తెందూల్కర్

అక్టోబరు 23న బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించాడు. పదవి చేపట్టిన కొద్ది రోజుల్లోనే భారత్​కు తొలి డే/నైట్​ టెస్టు నిర్వహించి, తన మార్కును చూపించాడు. ఈ మ్యాచ్​లో బంగ్లాదేశ్​పై భారత్​.. ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇదీ చదవండి: ఈ దశాబ్దం విరాట్​దే.. పదేళ్లలో 20వేల పరుగులు

Last Updated : Nov 26, 2019, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details