తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరిసిన ప్రసిద్ధ్, కృనాల్​- తొలి వన్డేలో భారత్​ విజయం

ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​లో కోహ్లీ సేన శుభారంభం చేసింది. తొలి మ్యాచ్​లో 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

Team India's victory in the first ODI against England
ఇంగ్లాండ్​పై తొలి వన్డేలో టీమ్​ఇండియా విజయం

By

Published : Mar 23, 2021, 9:28 PM IST

Updated : Mar 23, 2021, 9:59 PM IST

ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​లో టీమ్​ఇండియా శుభారంభం చేసింది. పుణె వేదికగా జరిగిన తొలి మ్యాచ్​లో 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ క్రిష్ణ 4, శార్దుల్ ఠాకూర్ 3, భువనేశ్వర్​ 2 వికెట్లతో రాణించారు. దీంతో మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కోహ్లీ సేన.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది. భారత బ్యాట్స్​మెన్లలో శిఖర్​ ధావన్​, విరాట్ కోహ్లీ, రాహుల్, కృనాల్ అర్ధ సెంచరీలతో రాణించారు.

కృనాల్ పాండ్య

ఆరంభంలో దూసుకెళ్లి.. తర్వాత టపాటపా..

అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్​ 251 పరుగులకే చేతులేత్తెసింది. పర్యటక జట్టు ఓపెనర్లు జేసన్ రాయ్​(35 బంతుల్లో 46 పరుగులు), జానీ బెయిర్​ స్టో(66 బంతుల్లో 94 పరుగులు) తొలి వికెట్​కు 135 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జంట 10 రన్​రేట్​తో పరుగులు సాధించింది. వీరిద్దరి జోరు చూస్తే ఇంగ్లాండ్​ విజయం నల్లేరుపై నడకే అనుకున్నారంతా. కానీ, ఇన్నింగ్స్​ 15వ ఓవర్​లో అద్భుతం జరిగింది. బంతి అందుకున్న ప్రసిద్ధ్​.. ఓపెనర్​ రాయ్​​ వికెట్​ను తీసి భారత్​కు తొలి వికెట్​ అందించాడు.

ప్రసిద్ధ్ క్రిష్ణను ప్రశంసిస్తున్న ఆటగాళ్లు
కోహ్లీ ఆనందం
వికెట్ తీసిన ఆనందంలో శార్దుల్

ఆ తర్వాత ఏ దశలోనూ ఇంగ్లాండ్​ గెలుపు దిశగా పయనించలేదు. క్రమంగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(30 బంతుల్లో 22) మరోసారి విఫలమయ్యాడు. మొయిన్ అలీ(37 బంతుల్లో 30) కాస్త ఫర్వాలేదనిపించాడు. 14.1 ఓవర్లలో 135 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచిన మోర్గాన్ సేన.. తర్వాత 116 పరుగులకే పది వికెట్లను కోల్పోయింది ఓటమి పాలైంది.

98 పరుగులతో సత్తాచాటిన భారత ఓపెనర్ శిఖర్ ధావన్​ను మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.

ఇదీ చదవండి:సచిన్ సరసన విరాట్​.. సొంతగడ్డపై 10వేల రన్స్​

Last Updated : Mar 23, 2021, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details