తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేఎల్ రాహుల్​కు ప్రమోషన్.. ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టిదే - కోహ్లీ వార్తలు

త్వరలో ఆసీస్ పర్యటనకు వెళ్లనున్న టీమ్​ఇండియా బృందాన్ని ప్రకటించారు. గాయం కారణంగా రోహిత్.. టూర్​ మొత్తానికి దూరమవగా, కేఎల్ రాహుల్​కు వైస్​ కెప్టెన్సీ బాధ్యతల్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Team India's T20I, ODI and Test squads for Tour of Australia announced
కేఎల్ రాహుల్​కు ప్రమోషన్.. ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టిదే

By

Published : Oct 26, 2020, 9:19 PM IST

త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోయే భారత జట్టును ప్రకటించారు. సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో చర్చించిన బోర్డు సభ్యులు.. జట్ల వివరాలను వెల్లడించారు.

ఇందులో భాగంగా టీమ్​ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తలో మూడు టీ20లు, వన్డేలు, నాలుగు టెస్టులు జరగనున్నాయి. ప్రస్తుతం గాయాలతో బాధపడుతున్న రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ.. వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.

టీ20 జట్టు: కోహ్లీ(కెప్టెన్), ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, సంజూ శాంసన్, జడేజా, వాషింగ్టన్ సుందర్, చాహల్, బుమ్రా, షమి, సైనీ, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి

బుమ్రా జడేజా

వన్డే జట్టు: కోహ్లీ(కెప్టెన్),ధావన్, శుభ్​మన్ గిల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, షమి, సైనీ, శార్దుల్ ఠాకుర్

టెస్టు జట్టు: కోహ్లీ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, కేఎల్ రాహుల్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుభ్​మన్ గిల్, వృద్ధిమన్ సాహా, పంత్, బుమ్రా, షమి, ఉమేశ్ యాదవ్, సైనీ, కుల్దీప్ యాదవ్, జడేజా, అశ్విన్, సిరాజ్

టీమ్​ఇండియా టెస్టు బృందం

ABOUT THE AUTHOR

...view details