తెలంగాణ

telangana

ETV Bharat / sports

'దేశ ప్రజలందరికీ పంద్రాగస్టు శుభాకాంక్షలు' - team india

ట్విట్టర్ వేదికగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది టీమిండియా. దేశ చరిత్రలోనే ప్రత్యేకమైన రోజని కోహ్లీ అన్నాడు. ఈ వీడియోను షేర్ చేసింది బీసీసీఐ.

టీమిండియా

By

Published : Aug 15, 2019, 1:05 PM IST

Updated : Sep 27, 2019, 2:20 AM IST

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు టీమిండియా శుభాకాంక్షలు తెలిపింది. ట్విట్టర్​ వేదికగా వీడియోలో తమ స్పందనను తెలిపారు క్రికెటర్లు. ఈ వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)షేర్ చేసింది.

"అందరికీ స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు, జైహింద్" -బీసీసీఐ ట్వీట్.

ఈ వీడియోలో కెప్టెన్ కోహ్లీ, రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రితో పాటు కేదార్ జాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, చాహల్ శుభాకాంక్షలు చెప్పారు. మన దేశ చరిత్రలో ప్రత్యేకమైన రోజని కోహ్లీ అన్నాడు. భారత అభిమానులందరికీ శుభాకాంక్షలు అని కేదార్ మరాఠిలో తెలిపాడు.

ఇది చదవండి: 'పెద్ద గాయమేం కాదు.. టెస్టులు ఆడతాను'

Last Updated : Sep 27, 2019, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details