తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇంగ్లాండ్​పై 3-0 తేడాతో భారత్​దే గెలుపు: హాగ్ - india cricket matches

ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​ను ఆతిథ్య టీమ్​ఇండియా గెలుచుకుంటుందని మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. తద్వారా టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ ఆడుతుందని చెప్పాడు.

Team India will beat England 3-0, or 3-1 in the Test series: Brad Hogg
ఇంగ్లాండ్​పై 3-0 తేడాతో భారత్​దే గెలుపు: హాగ్

By

Published : Jan 23, 2021, 5:30 AM IST

ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకొచ్చిన టీమ్​ఇండియా.. వచ్చే నెల నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్​తో పలు సిరీస్​లు ఆడనుంది. అందులో భాగంగా తొలుత నాలుగు టెస్టుల్లో తలపడనుంది. అయితే ఇంగ్లీష్ జట్టుపై 3-0, 3-1 తేడాతో భారత్ సిరీస్​ గెల్చుకుంటుందని ఆసీస్ మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై భారత్​కు గెలుపు రికార్డు ఉందని గుర్తు చేశాడు.

టీమ్​ఇండియా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్

"3-0, 3-1 తేడాతో టెస్టు సిరీస్​ను భారత్ గెల్చుకుంటుంది. ఆహ్మదాబాద్​లో జరిగే మూడో మ్యాచ్​లో ఇంగ్లాండ్ విజయం సాధించొచ్చు. మిగతా మ్యాచ్​లు మాత్రమే టీమ్​ఇండియావే కావొచ్చు. దీంతో లార్డ్స్​లో జరిగే ఫైనల్​ను టీమ్​ఇండియా ఆడుతుంది" -బ్రాడ్ హాగ్, ఆసీస్ మాజీ బౌలర్

గత దశాబ్ద కాలంలో భారత్​పై టెస్టుల్లో గెలిచిన జట్టు ఇంగ్లాండ్ ఒక్కటే కావడం విశేషం. 2012లో మన దేశానికి వచ్చిన ఆ జట్టు.. అలిస్టర్ కుక్ సారథ్యంలో 2-1 తేడాతో టెస్టు సిరీస్​ గెల్చుకుంది. ఆ తర్వాత 2016లో 0-4 తేడాతో టీమ్​ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది.

ప్రస్తుతం ఆసీస్​పై గెల్చిన ఉత్సాహంతో ఉన్న భారత్.. అదే ఊపును ఇంగ్లాండ్​పై కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు ప్రత్యర్థి జట్టు కూడా ప్రణాళికలు రచిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్​షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమ్​ఇండియా.. ఈ సిరీస్​ను 2-0, 3-0, 3-1, 4-0 తేడాతో సొంతం చేసుకుంటే నేరుగా తుదిపోరుకు అర్హత సాధిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details