తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​ పర్యటనకు దూరమైన సాహా..? - australia tour wriddhiman saha

ఐపీఎల్​లో గాయపడిన టీమ్​ఇండియా వికెట్​కీపర్​ వృద్ధిమాన్​ సాహా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. డిసెంబర్​ 17 నుంచి ఆసీస్​తో టెస్టు సిరీస్​ ప్రారంభంకానుంది.

wriddhiman saha
సాహా.

By

Published : Nov 9, 2020, 7:03 AM IST

కెరీర్‌లో ఎక్కువశాతం గాయాలతోనే నెట్టుకొచ్చిన టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు మరోసారి కీలక సమయంలో గాయమైంది. అతనికి చీలమండలో చీలిక వచ్చినట్లు తెలిసింది.

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడిన సాహా.. గాయం కారణంగానే బెంగళూరుతో ఎలిమినేటర్‌తో పాటు దిల్లీతో క్వాలిఫయర్స్‌-2కు కూడా దూరయ్యాడు. వృద్ధిమాన్‌కు చీలమండ గాయమైంది అని దిల్లీతో పోరులో టాస్‌ సందర్భంగా హైదరాబాద్‌ కెప్టెన్‌ వార్నర్‌ ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు అతను వెళ్తాడా వెళ్లడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

వృద్ధిమాన్‌ గాయం తీవ్రత తక్కువే అయితే నాలుగు వారాల విశ్రాంతి తర్వాత ఆసీస్‌తో డిసెంబర్‌ 17న ఆరంభమయ్యే తొలి టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలుంటాయి. ఒకవేళ గాయం ప్రమాదకరమైనదైతే అతను ఆసీస్‌ వెళ్లే విమానం ఎక్కడు.

ఇదీ చూడండి : ఆ జాబితాలో రోహిత్​ను దాటేసిన ధావన్

ABOUT THE AUTHOR

...view details