తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాకర్​ టోర్నీకి రోహిత్ ప్రచారం​​.. లీగ్​ చరిత్రలో ఇదే తొలిసారి - rohit football playing

టీమిండియా స్టార్​ బ్యాట్స్​మన్​ రోహిత్​శర్మ.. ఫుట్​బాల్​ టోర్నీకి బ్రాండ్​ అంబాసిడర్​గా కనువిందు చేయనున్నాడు. భారత్​లో ఇకపై లాలిగా లీగ్​కు ఇతడే ప్రచారం చేయనున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి నాన్​-ఫుట్​బాల్​ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నాడు హిట్​మ్యాన్.

ohit sharma becomes laliga league first ever brand
సాకర్​ టోర్నీకి రోహిత్ ప్రచారం​​.. లీగ్​ చరిత్రలో ఇదే తొలిసారి

By

Published : Dec 12, 2019, 8:16 PM IST

ఫుట్​బాల్​కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత్​లో కొంచెం ఆదరణ తక్కువగా ఉన్న ఈ క్రీడకు ప్రచారం కల్పించేందుకు అంగీకరించాడు టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ​. ప్రముఖ లాలిగా సాకర్​ టోర్నీకి భారత్​లో హిట్​మ్యాన్​ను ప్రచారకర్తగా నియమించింది ఆ టోర్నీ యాజమాన్యం. తద్వారా ఇప్పటివరకు ఈ లీగ్​ చరిత్రలో బ్రాండ్​ అంబాసిడర్​గా ఎంపికైన నాన్​-ఫుట్​బాల్​ ప్లేయర్​గా ఘనత సాధించాడీ ఆటగాడు​.

లాలిగా​ టోర్నీకి రోహిత్ ప్రచారం

ఐపీఎల్ లాంటిది​...

2017 నుంచే భారత్​లో సాకర్​ లీగ్​ మ్యాచ్​ల్ని నిర్వహిస్తోంది లాలిగా. ఈ టోర్నీ ద్వారా భారత్​లో ఫుట్​బాల్​కు ఆదరణ పెంచేందుకు సహకరిస్తానని చెప్పాడు రోహిత్​. కొన్నేళ్లుగా భారత ఫుట్‌బాల్‌ బాగా అభివృద్ధి చెందిందని చెప్పిన ఈ స్టార్​ క్రికెటర్​... ఆటలో పోటీతత్వం పెరిగిందని అభిప్రాయపడ్డాడు.

"ఫుట్​బాల్​కు ఇండియాలో ఆదరణ పెరుగుతోంది. ఐఎస్‌ఎల్‌లో మ్యాచ్​ల్లో భారత ఆటగాళ్ల ఆటకు అభిమానులు క్రమంగా పెరుగుతున్నారు. మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయి. ఐఎస్‌ఎల్‌ యువ ప్లేయర్లకు మంచి వేదికగా నిలిచింది. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఐపీఎల్‌ తరహాలో ఫుట్‌బాలర్లకు ఈ టోర్నీ ఉపయోగపడుతోంది".

- రోహిత్​ శర్మ, క్రికెటర్​

మహీ టాప్​క్లాస్​...

భారత యువ క్రికెటర్లలో చాలామంది ఫుట్‌బాలర్ల కేశాలంకరణను అనుసరించేందుకు వెనుకాడరని అన్నాడు టీమిండియా వైస్‌కెప్టెన్‌ రోహిత్. తాను అభిమానించే ఫుట్‌బాలర్‌, జట్టు, క్లబ్‌ ఏంటో చెప్పాడు.

"భారత జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య లాంటి యువ ఆటగాళ్లు ఫుట్‌బాల్‌ను అనుసరిస్తారు. ఆటగాళ్లను గమనిస్తారు. వారి కేశాలంకరణను అనుకరిస్తారు. టీమిండియాలో చాలామంది సాకర్ బాగా ఆడతారు. మా జట్టులో గ్లాటన్‌ ఇబ్రహిమోవిచ్‌ ఉన్నాడు. అతడే ఇషాంత్‌ శర్మ. ఎంఎస్‌ ధోనీ అద్భుతమైన పుట్‌బాలర్‌" అని తెలిపాడు రోహిత్​.

ఫుట్​బాల్​ ఆడుతున్న ధోనీ ఫొటో

ఎప్పట్నుంచో తనకు సాకర్​ క్రీడ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు రోహిత్​ శర్మ. ఫ్రాన్స్​ ఫుట్​బాల్​ ప్లేయర్​ జినెడిన్‌ జిదానె ఆటంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. మైదానంలో అతడి ఆటను చూస్తానని చెప్పిన హిట్​మ్యాన్​.... రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్, స్పెయిన్‌ జట్టు తన ఫేవరెట్​ అని అభిప్రాయపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details