తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో టీ20 కోసం టీమిండియా భారీ కసరత్తులు - Rohit Sharma

రాజ్​కోట్​ వేదికగా గురువారం(నవంబర్​ 7).. భారత్​-బంగ్లాదేశ్ రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్​కు తుపాను ముప్పు పొంచి ఉంది. అయినప్పటికీ టీమిండియా క్రికెటర్లు తీవ్రంగా ప్రాక్టీసు చేస్తూ కనిపించారు. తొలి మ్యాచ్​లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు.

రెండో టీ20 కోసం టీమిండియా భారీ కసరత్తులు

By

Published : Nov 6, 2019, 5:28 PM IST

తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్‌, బంగ్లా క్రికెటర్లు రెండో టీ20 కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. రాజ్‌కోట్‌ వేదికగా రేపు(గురువారం) జరగనున్న ఈ మ్యాచ్​లో గెలిచి తీరాలని రోహిత్​ సేన భావిస్తోంది. ఇందుకోసం గత రెండు రోజులుగా మైదానంలో తీవ్రంగా చెమటోడ్చారు భారత ఆటగాళ్లు.

బుధవారం జరిగిన ప్రాక్టీసు సెషన్​కు ఎటువంటి అంతరాయం కలగలేదు. వాతావరణం పొడిగా ఉండటం వల్ల క్రికెటర్లు.. విపరీతంగా నెట్స్​లో శ్రమించారు. రోహిత్​ శర్మ, సంజూ శాంసన్​, శ్రేయస్​ అయ్యర్​ ప్రాక్టీసు చేస్తూ కనిపించారు. కేఎల్​ రాహుల్​, పంత్​, కృనాల్​ పాండ్య, వాషింగ్టన్​ సుందర్​ నెట్స్​లో​ సాధన చేశారు.

ఇప్పటికే మైదానం సిద్ధం చేసినట్లు సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం తెలిపింది. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని... కచ్చితంగా మ్యాచ్‌ నిర్వహించేందుకు వీలుంటుందని ధీమా వ్యక్తం చేసింది. ఒకవేళ మ్యాచ్​రోజు ఉదయం వాన పడినా సాయంత్రానికి గ్రౌండ్ సిద్ధం చేస్తామని మైదాన సిబ్బంది అన్నారు.

మైదాన ప్రాంతంలో వాతావరణం

దిల్లీలో వేదికగా జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది బంగ్లాదేశ్. తొలిసారి ఈ ఫార్మాట్​లో టీమిండియాపై గెలిచింది.

రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. గురువారం వేకువజామున 'మహా' తుపాను గుజరాత్‌లోని డయు, పోర్‌బందర్‌ మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details