తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డే ర్యాంకింగ్స్​: విరాట్​, బుమ్రాదే మళ్లీ టాప్​ - ICC rankings, Indian cricket team, jasprit bumrah, odi rankings, virat kohli

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్​లో విరాట్​ కోహ్లీ, జస్ప్రీత్​ బుమ్రా తమ అగ్రస్థానాలను కాపాడుకున్నారు. 895 పాయింట్లతో విరాట్​ టాప్​-1 బ్యాట్స్​మెన్​గా నిలిచాడు. రోహిత్​ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.

వన్డే ర్యాంకింగ్స్​: విరాట్​, బుమ్రాదే మళ్లీ టాప్​

By

Published : Nov 12, 2019, 6:33 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత సారథి విరాట్‌ కోహ్లీ, టీమిండియా స్టార్​ పేసర్​ జస్ప్రీత్‌ బుమ్రా టాప్‌లో నిలిచారు. బ్యాటింగ్‌లో 895 రేటింగ్‌ పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా... అతడి తర్వాతి స్థానంలో టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ (863) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

బుమ్రా ఒక్కడే...

బౌలింగ్‌లో భారత్‌ నుంచి బుమ్రా (797) మినహా ఎవరూ టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు. న్యూజిలాండ్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 740 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్​తో వన్డే సిరీస్​లో అద్భుత ప్రదర్శన చేసిన అఫ్గాన్​ బౌలర్​ ముజీబ్​ ఉర్​ రహ్మన్​... రెండు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంక్​కు చేరుకున్నాడు.

ఆల్‌రౌండర్​ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు హార్దిక్‌ పాండ్య పదో స్థానంలో నిలిచాడు. జట్టు విభాగంలో భారత్‌ (122) రెండో స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచకప్‌ విజేత ఇంగ్లాండ్‌ (125) అగ్రస్థానంలో నిలిచింది.

టెస్టు ఫార్మాట్‌లో మొదటి స్థానంలో ఉన్న భారత్... టీ20ల్లో మాత్రం ఐదో స్థానంలో కొనసాగుతోంది. పొట్టి ఫార్మాట్​ బ్యాటింగ్​లో రోహిత్​(7), కేెఎల్​ రాహుల్​(8) స్థానంలో ఉన్నా... బౌలింగ్​, ఆల్​రౌండర్ల విభాగంలో టాప్​-10లో ఒక్క భారతీయ ఆటగాడికి చోటు దక్కలేదు.

ఇప్పటికే బంగ్లాపై మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది రోహిత్‌ సారథ్యంలోని భారతజట్టు. ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య మొదటి టెస్టు నవంబర్‌ 14న ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details