తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బంగ్లాను ఓడించేందుకు పక్కా ప్లాన్​తో వస్తాం' - బంగ్లా-భారత్​ రెండో టీ20

తొలి టీ20లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది రోహిత్​సేన. రెండో టీ20లో గెలిచి సిరీస్​ను​ కాపాడుకోవాలని ఆరాటపడుతోంది. గురువారం రాజ్​కోట్​ వేదికగా జరగనున్న మ్యాచ్​లో కొన్ని మార్పులతో బరిలోకి దిగుతోంది.

బంగ్లాను ఓడించేందుకు ప్లాన్​ మార్చాం: రోహిత్​

By

Published : Nov 6, 2019, 6:19 PM IST

దిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్​పై 7 వికెట్ల తేడాతో గెలిచింది బంగ్లా జట్టు. ఈ మ్యాచ్​లో ఇద్దరు పేసర్లు ఖలీల్​ అహ్మద్​, దీపక్​ చాహర్​, ఆల్​రౌండర్​ శివమ్​ దూబే సహా ముగ్గరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది రోహిత్​ సేన. అయితే గురువారం జరగనున్న రెండో టీ20లో బౌలింగ్​ విభాగంలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధమైంది.

" బ్యాటింగ్​ విభాగం పటిష్టంగానే ఉంది. ఇందులో ఎటుంటి మార్పులు అవసరం లేదని అనిపిస్తోంది. కానీ పిచ్​ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తుది జట్టును ఎంపిక చేస్తాం".
-- రోహిత్​శర్మ

లెఫ్టార్మ్​ పేసర్​ ఖలీల్​ అహ్మద్​ స్థానంలో శార్దుల్​ ఠాకుర్​కు అవకాశం ఇవ్వనుంది యాజమాన్యం. పిచ్​ పరిస్థితులు గమనించాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు రోహిత్​. దిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియం కన్నా రాజ్​కోట్​ మైదానం పిచ్​ బాగుందని అన్నాడు హిట్​మ్యాన్​.

గురువారం నిర్వహించిన ప్రాక్టీసు సెషన్​లో రోహిత్​ శర్మ, సంజూ శాంసన్​, శ్రేయస్​ అయ్యర్​ కనిపించారు. కేఎల్​ రాహుల్​, కృనాల్​ పాండ్యా, వాషింగ్టన్​ సుందర్​ సైతం నెట్స్​లో​ సాధన చేశారు.

ప్రాక్టీసులో శ్రేయస్​, సంజూ శాంసన్​, రోహిత్​

'మహా' అడ్డంకి..!

కాలుష్యం కమ్మేసిన దిల్లీలో భారత్‌-బంగ్లాదేశ్‌ తొలి టీ20 ముందు చాలా ఇబ్బందులు ఎదురైయ్యాయి. అతి కష్టం మీద అక్కడ మ్యాచ్​ జరిగింది. ఇప్పుడు రెండు జట్ల మధ్య రెండో టీ20కి కూడా వాతావరణ సమస్య తప్పేలా లేదు. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న రాజ్‌కోట్‌లో తుపాను సూచనలున్నాయి. గురువారం మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం గుజరాత్‌ అంతటా ‘మహా’ తుపాను ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మ్యాచ్‌ రోజు ఉదయం భారీ వర్షం పడొచ్చని చెప్పింది. మరి రాత్రి 7 గంటలకు ఆట ఆరంభమయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో.. మ్యాచ్‌ జరుగుతుందో లేదో చూడాలి. తొలి టీ20లో ఓడిన భారత్‌.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడి ఉంది.

ABOUT THE AUTHOR

...view details