తెలంగాణ

telangana

ETV Bharat / sports

డాన్స్‌తో అదరగొట్టిన యూజీ సతీమణి - డాన్స్‌తో అదరగొట్టిన యూజీ సతీమణి

టీమ్​ఇండియా స్పిన్నర్​ చాహల్​ సతీమణి ధనశ్రీ వర్మ ఓ పాటకు అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్​ వేసింది. వైరల్​గా మారిన ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

UG
యూజీ

By

Published : Jan 21, 2021, 8:37 AM IST

టీమ్‌ఇండియా మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంటాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సహా ఏ ఆటగాడు సోషల్‌ మీడియాలో సంగతులు పంచుకున్నా వెంటనే ట్రోల్‌ చేస్తుంటాడు. అల్లరి చేష్టలతో కవ్విస్తుంటాడు.

యూజీ సతీమణి ధనశ్రీ వర్మ సైతం యూట్యూబర్‌గా వెరీ ఫేమస్‌! డ్యాన్సర్‌గా ఆమెకు మంచి పేరుంది. ఆమె యూట్యూబ్‌ ఛానల్‌కు లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఇక సోషల్‌ మీడియాలోనూ ఆమె ఎంతో చురుకుగా ఉంటుంది. అభిషేక్‌ బచ్చన్‌ నటించిన బ్లఫ్‌మాస్టర్‌ చిత్రంలోని బురోబురో పాటకు ధనశ్రీ డ్యాన్స్‌ చేసింది. అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టింది. ఆ వీడియోను ఇన్‌స్టాలో పంచుకోగా వేలల్లో లైకులు లభిస్తున్నాయి. దాంతో ఇది వైరల్‌గా మారింది. ఆ వీడియోను మీరు చూసేయండి.

ఇదీ చూడండి : వివాహ బంధంతో ఒక్కటైన చాహల్​- ధనశ్రీ

ABOUT THE AUTHOR

...view details