తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిమానులూ... పంత్​పై కాస్త దయ చూపండి: కోహ్లీ - virat kohli

హైదరాబాద్​లో భారత్​-వెస్డిండీస్ మధ్య శుక్రవారం తొలి టీ20 జరగనుంది. ఈ మ్యాచ్​కు​ ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ కోహ్లీ... యువకీపర్​ రిషబ్​ పంత్​ను వెనకేసుకొచ్చాడు. టీ20ల్లో ప్రయోగాలు కొనసాగుతాయని స్పష్టం చేశాడు.

team india skipper Virat Kohli backs Rishabh Pant and Says Disrespectful To Chant MS Dhoni's Name In The Stands
అభిమానులూ... పంత్​పై కాస్త దయ చూపండి: కోహ్లీ

By

Published : Dec 5, 2019, 4:32 PM IST

Updated : Dec 5, 2019, 4:45 PM IST

మీడియా సమావేశంలో విరాట్​ కోహ్లీ

మైదానంలో యువకీపర్​ పంత్​ను ఎగతాళి చేస్తూ... గత మ్యాచ్​ల్లో ధోనీ పేరు పలకడంపై టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మహీ పేరు అరుస్తూ యువ ఆటగాడిని అపహాస్యం చేయొద్దని అభిమానులను కోరాడు. హైదరాబాద్​లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం... వెస్టిండీస్‌తో తొలి టీ20 ఆడనుంది టీమిండియా. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు కోహ్లీ.

" యువ ఆటగాడి(పంత్​)కి కొంత స్పేస్​ ఇవ్వాల్సిన బాధ్యత చుట్టుపక్కల ఉన్న వారందరిపై ఉంది. అభిమానులు దయచేసి ధోనీ పేరు పలుకుతూ పంత్​ను అపహాస్యం చేయొద్దు. ఏ క్రికెటర్ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాలని అనుకోడు. దేశం కోసం ఆడుతున్నప్పుడు ఆటగాడి తప్పులు ఎంచడం మానేసి... అతడికి కావాల్సిన మద్దతు ఇవ్వాలి" --కోహ్లీ, టీమిండియా సారథి

ప్రపంచప్​ తర్వాత విండీస్ గడ్డపై జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్​కు.. ధోనీ స్థానంలో రిషబ్​ పంత్​ ఎంపికయ్యాడు. అప్పట్నుంచి జరిగిన ఏ సిరీస్​లోనూ బ్యాటింగ్​, కీపింగ్​లో ఆకట్టుకోలేకపోయాడు. క్యాచ్​లు వదిలేయడం, డీఆర్​ఎస్​ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడంపై అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. వాటి గురించే కోహ్లీ మాట్లాడాడు. ఇప్పటికి వరకు 23 టీ20​లు ఆడిన పంత్​​... 19.88 సగటుతో మాత్రమే 358 పరుగులు చేశాడు. స్ట్రైక్​ రేటు 118.15 ఉంది.

టీమిండియా.. ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉందన్న కోహ్లీ.. టీ20ల్లో ర్యాంకింగ్స్‌ను పట్టించుకోవడం లేదన్నాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ జరుగనున్న నేపథ్యంలో ఈ ఫార్మాట్‌లో ప్రయోగాలను కొనసాగిస్తామన్నాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. జట్టుకు ప్రధాన బలమని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జడేజా కీలక ఆటగాడని కితాబిచ్చాడు.

భారత్​ పర్యటనలో భాగంగా వెస్టిండీస్.. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ శుక్రవారం తొలి మ్యాచ్​.. ఈనెల​ 22న కటక్​ వేదికగా చివరి మ్యాచ్​ జరగనుంది.

Last Updated : Dec 5, 2019, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details